సోమవారం 26 అక్టోబర్ 2020
Science-technology - Sep 28, 2020 , 18:03:52

‘ఆస్టరాయిడ్ మైనింగ్ రోబో’ను అంతరిక్షంలోకి పంపనున్న చైనా

‘ఆస్టరాయిడ్ మైనింగ్ రోబో’ను అంతరిక్షంలోకి పంపనున్న చైనా

బీజింగ్‌ : ప్రపంచంలో మొట్టమొదటి మైనింగ్ రోబోను అంతరిక్షంలోకి పంపేందుకు చైనా సిద్ధమైంది. ఈ ఏడాది నవంబర్ నాటికి ఈ రోబోను పంపాలని నిర్ణయించారు. ఐఈఈఈ స్పెక్ట్రమ్‌ నివేదిక ఈ విషయాలను నివేదించింది. ఒక ప్రైవేట్ బీజింగ్ సంస్థ అయిన ఆరిజిన్ స్పేస్ ప్రపంచంలోనే తొలి మైనింగ్ రోబో ‘ఆస్టరాయిడ్ మైనింగ్ రోబో’ 2020 నవంబర్ నాటికి అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే ఈ రోబో మైనింగ్ చేయదు. కానీ, గ్రహశకలం యొక్క విలువైన వనరులను గుర్తించడం, సేకరించే సామర్ధ్యాల ప్రాధమిక అంచనా వేయడం ఈ మిషన్ ప్రత్యేకత. 30 గ్రాముల అంతరిక్ష నౌక ఎన్‌ఈవో-1 ను చైనీస్ లాంగ్ మార్చ్ రాకెట్‌పై సెకండ్‌ పేలోడ్‌గా ప్రయోగించే అవకాశం ఉన్నది. ఇది 500 కిలోమీటర్ల ఎత్తులో భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 

ఎన్‌ఈవో-1 మిషన్ ద్వారా చేయగలిగే వాస్తవ పురోగతి ఊహాగానాలకు లోబడి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించలేదు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. ట్రిలియన్ డాలర్ల పరిశ్రమను తెరిచేందుకు చైనాకు ఆస్కారం ఉంటుంది. ఈ మిషన్ అంతరిక్ష వనరుల పరిశ్రమకు మైలురాయిగా ఉంటుందని సంస్థ తెలిపింది. చైనాకు చెందిన మరో కంపెనీ మిషన్ ‘యువాన్వాంగ్ -1’ కూడా ఉన్నది. దీనికి ‘లిటిల్ హబుల్’ అనే మారుపేరు ఉన్నది. దీనిని 2021 చివరిలో లేదా 2022 ప్రారంభంలో ప్రయోగించనున్నారు.


logo