సోమవారం 13 జూలై 2020
Science-technology - May 12, 2020 , 16:24:01

బీఎస్6 ప్రమాణాలతో కవాసకీ నింజా 650 బైక్ విడుదల

బీఎస్6 ప్రమాణాలతో   కవాసకీ నింజా 650  బైక్ విడుదల

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రీమియం మోటార్ సైకిల్స్ కంపెనీ కవాసకి మంగళవారం భారత మార్కెట్లోకి సరికొత్త బైక్‌ను ఆవిష్కరించింది.  బీఎస్6 ప్రమాణాలతో అద్భుత ఫీచర్లతో కొత్త 2020 నింజా 650 మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌ ధర రూ.6.24లక్షలు(ఢిల్లీ ఎక్స్‌షోరూం)గా నిర్ణయించినట్లు తెలిపింది. 2019 మోడల్‌ ధర కంటే ఇది కేవలం 35వేలు మాత్రమే ఎక్కువని పేర్కొంది. 649సీసీ పారలల్‌ ట్విన్‌ ఇంజిన్‌తో 2020 నింజా 650 బైక్‌ను శక్తివంతమంతగా రూపొందించింది. 

మోటార్‌ సైకిల్‌కు ఇప్పుడు బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది.వినియోగదారులు కొత్త బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే కవాసకీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది.  కంపెనీ డీలర్లు ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌ ప్రారంభించాయి. logo