e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News న‌న్ను ఏలియ‌న్లు 50 సార్లు కిడ్నాప్ చేశారు.. నేను నిరూపించ‌గ‌ల‌ను!

న‌న్ను ఏలియ‌న్లు 50 సార్లు కిడ్నాప్ చేశారు.. నేను నిరూపించ‌గ‌ల‌ను!

న‌న్ను ఏలియ‌న్లు 50 సార్లు కిడ్నాప్ చేశారు.. నేను నిరూపించ‌గ‌ల‌ను!

లండ‌న్‌: ఏలియ‌న్లు ఉన్నారా? ఈ అనంత విశ్వంలో భూమిపై కాకుండా మ‌రో గ్ర‌హంపై జీవం ఉందా? దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ స్ప‌ష్ట‌మైన ఆధారాలు లేవు కానీ.. స్టీఫెన్ హాకింగ్‌లాంటి మేధావులు కూడా ఏలియ‌న్లు ఉండ‌వ‌చ్చ‌ని చాలాసార్లు చెప్పారు. అప్పుడ‌ప్పుడూ యూఎఫ్‌వోలు కూడా క‌నిపిస్తున్నాయ‌ని నెట్‌లో చూస్తేనే ఉంటాం. అయితే ఓ బ్రిటిష్ మ‌హిళ మాత్రం ఏలియ‌న్లు ఉండ‌ట‌మేంటి.. వాళ్లు న‌న్ను 50 సార్లు కిడ్నాప్ కూడా చేశారు అని చెబుతోంది. అది కూడా వాళ్ల యూఎఫ్‌వోల‌లోనే తీసుకెళ్లార‌ని, ఈ సంద‌ర్భంగా త‌నకు వాళ్ల అత్యాధునిక టెక్నాల‌జీల‌ను కూడా చూపించార‌ని ఆమె చెప్పింది.

బ్రాడ్‌ఫోర్డ్‌కు చెందిన 50 ఏళ్ల పౌలా స్మిత్ అనే మ‌హిళ ఈ షాకింగ్ కామెంట్స్ చేసిన‌ట్లు డైలీస్టార్ వెల్ల‌డించింది. త‌న చిన్న‌త‌నంలో తొలిసారి ఏలియ‌న్ల‌ను చూశాన‌ని, అప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ చూస్తూనే ఉన్నాన‌ని ఆమె చెప్ప‌డం విశేషం. వాళ్లు త‌న‌ను కిడ్నాప్ చేశార‌ని, ఈ సంద‌ర్భంగా త‌న ఒంటిపై అయిన గాయాల‌ను కూడా పౌలా చూపిస్తోంది. ఏలియ‌న్లు సిల్వ‌ర్ క‌ల‌ర్‌లో ఉన్న‌ట్లు కూడా ఆమె చెప్పింది. ఏవో వింత వింత ఫొటోల‌ను కూడా ఆమె చూపిస్తున్న‌ట్లు డైలీస్టార్ రిపోర్ట్ వెల్ల‌డించింది.

మొత్తం 52సార్లు నాకు ఇలాంటి అతీత‌మైన అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. అలా జ‌రిగేది కూడా ముందుగా తెలియ‌దు. స‌డెన్‌గా జ‌రిగిపోతుంది అని పౌలా స్మిత్ చెప్పింది. తాను యూఎఫ్‌వోలో వెళ్లాన‌నీ తెలిపింది. అయితే తాను చెప్పేది ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని, హేళ‌న కూడా చేస్తున్నార‌ని ఆమె వాపోతోంది. నిజానికి ప్ర‌తి ఏటా యూఎఫ్‌వోలు క‌నిపిస్తున్నాయ‌న్న వార్త‌లు ప్ర‌పంచంలో ఏదో ఒక మూల నుంచి వ‌స్తూనే ఉంటాయి. అందులోనూ క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఇవి మ‌రింత ఎక్కువ‌గా వ‌చ్చాయ‌ని యూఎఫ్‌వో రిపోర్టింగ్ సెంట‌ర్ వెల్ల‌డించింది. గ‌తేడాది 480 రిపోర్టులు వ‌చ్చిన‌ట్లు తెలిపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న‌న్ను ఏలియ‌న్లు 50 సార్లు కిడ్నాప్ చేశారు.. నేను నిరూపించ‌గ‌ల‌ను!

ట్రెండింగ్‌

Advertisement