శనివారం 27 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 16, 2021 , 13:48:05

అమెజాన్‌ ‘బ్లూ ఆరిజన్‌’ సక్సెస్‌

అమెజాన్‌ ‘బ్లూ ఆరిజన్‌’ సక్సెస్‌

వాషింగ్టన్‌ : అమెజాన్ జెఫ్ బెజోస్ స్థాపించిన రాకెట్ సంస్థ బ్లూ ఆరిజిన్ పరీక్ష విజయవంతంమైంది. తాజా న్యూ షెపర్డ్ మిషన్‌తో మానవులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి మరో అడుగు ముందుకు పడింది. సంస్థ మొట్టమొదటి స్పేస్ ఫ్లైట్ 14 వ టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా పరీక్షించారు. లాంచింగ్‌ నుంచి క్యాప్సూల్ యొక్క మృధువైన ల్యాండింగ్ వరకు మొత్తం 10 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. దీనికి ఎస్‌ఎస్‌-14 అని పేరు పెట్టారు. ఈ విజయవంతమైన విమానం కొత్త బూస్టర్లను, కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన క్యాప్సూళ్లను పరీక్షించింది. అమెజాన్ యొక్క ప్రైవేట్ స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్. అనేక సంవత్సరాలుగా అంతరిక్ష పరిశోధనలు చేపడుతూ విజయవంతంగా బ్లూ ఆరిజన్‌ను పరీక్షించింది. ఏప్రిల్ నుంచి తన మొదటి ప్రయాణికుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి సర్వం సిద్ధం చేసుకున్నది. 

బ్లా ఆరిజన్‌ యొక్క న్యూ షెపర్డ్ అంతరిక్షంలోకి మొట్టమొదటి మార్గదర్శక విమానంలో ప్రయాణించి విజయవంతమైన ల్యాండింగ్ చేపట్టి ఐదు సంవత్సరాలు దాటింది. బ్లూ ఆరిజిన్ తన మొట్టమొదటి మానవ ప్రయాణికుడిని అంతరిక్షంలోకి పంపే పనిని ఆశించిన దానికంటే నెమ్మదిగా సాగుతున్నది. NS-14 మిషన్‌లోని సిబ్బంది క్యాప్సూల్‌లో అనేక నవీకరణ వ్యవస్థలను ఉపయోగించారు. వ్యోమగాములను మిషన్ కంట్రోల్‌తో మాట్లాడటానికి ఇది పుష్-టు-టాక్ సిస్టంను కలిగి ఉన్నది. క్యాప్సూల్‌లో శబ్దాన్ని తగ్గించడానికి కుషన్ లైనింగ్స్, ఎయిర్ కండిషన్, తేమ నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. 

న్యూ షెపర్డ్ పూర్తిగా స్వయంప్రతిపత్తి వ్యవస్థ. ఈ పరీక్షలో పేలోడ్‌ను లోపల ఉంచడం ద్వారా రాకెట్ ఎగిరింది. క్యాప్సూల్‌ భూమికి తిరిగి వచ్చే ముందు సున్నా గురుత్వాకర్షణ వద్ద 10 నిమిషాలు గడిపింది. ఆరుగురు వ్యోమగాములను రాకెట్ ఎగువ భాగంలో తీసుకువెళ్ళడానికి వీలుగా క్యాప్సూల్‌ను రూపొందించారు. న్యూ షెప్పర్డ్‌ తదుపరి పరీక్షలు ఆరు వారాల తరువాత ఫిబ్రవరి చివరి నాటికి జరుగనున్నాయి. 2021 ఏప్రిల్‌లో బ్లూ క్రూతో విమానాన్ని అంతరిక్షంలోకి పంపడం అసలు లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రూ లోడింగ్, అన్లోడ్ తదుపరి టెస్ట్ ఫ్లైట్ ఎన్ఎస్ -15 లో పరీక్షించనున్నారు. 


అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజన్‌ 2000 లో ప్రారంభించారు. జెఫ్ బెజోస్ తన అమెజాన్ షేర్లను దాని నిధుల కోసం అమ్మడం కొనసాగించారు. వాషింగ్టన్‌లోని బ్లూ ఆరిజిన్ ప్రధాన కార్యాలయంలో 3,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇలాఉండగా, బ్లూ ఆరిజిన్ ఇంకా ధరలను ప్రకటించలేదు. అలాగే ఎప్పుడు అంతరిక్ష విమానాల కోసం రిజర్వేషన్లు తీసుకోవడం ప్రారంభిస్తారనే విషయాన్ని కూడా వెల్లడించలేదు.

ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో పోటీ

జెఫ్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజిన్.. ఎలోన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్‌తో పోటీ పడుతున్నది. 2020 మే నెలలో స్పేస్ఎక్స్ మానవులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్ళిన మొదటి ప్రైవేట్ సంస్థగా అవతరించింది. అదే సమయంలో ఎలోన్ మస్క్ ఇటీవల జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.


ఇవి కూడా చదవండి..

మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!

చివరి శ్వాస వరకు అంతరిక్ష పరిశోధనల కోసమే..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo