శుక్రవారం 04 డిసెంబర్ 2020
Science-technology - Oct 29, 2020 , 12:55:30

31న కనువిందు చేయనున్న బ్లూ మూన్‌

31న కనువిందు చేయనున్న బ్లూ మూన్‌

ముంబై : ఈనెల 31న ఆకాశంలో చంద్రుడు కనివిందు చేయనున్నాడు. చందమామ నిండుగా కనిపించనున్నాడు. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూ మూన్‌గా పిలుస్తారు. ఈ నెలలో సాధారణంగా ఒక పౌర్ణమి, అమావాస్య వస్తూ ఉంటాయని, ఒకే నెలలో రెండు సార్లు పూర్ణ చంద్రులు అసాధారణ సందర్భాలని ముంబై నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్‌ అరవింద్‌ పరంజ్‌పే పేర్కొన్నారు. చంద్రుడి నెల వ్యవధి 29. 531 రోజులని లేదంటే.. 29 రోజులు, 12 గంటలు, 44 నిమిషాలు 38సెకన్లు. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు ఉండాలంటే నెల 1, 2తేదీల్లో తొలి పౌర్ణమి రావాలని పరంజ్‌పే పేర్కొన్నారు. సుమారు 30 నెలల తర్వాత సంవత్సరంలో ఒక అదనపు పౌర్ణమి ఉంటుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో 28 రోజులు, లీప్‌ సంవత్సరంలో 29 రోజులు ఉండడం కూడా సాధ్యం కాదని ఆయన అన్నారు.

ఢిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్‌ రత్నశ్రీ మాట్లాడుతూ బ్లూ మూన్‌ సాధారణమైన విషయం కాదన్నారు. 30 రోజులతో ఒక నెలలో చివరి బ్లూ మూన్ జూన్ 30, 2007 న మరొకటి సెప్టెంబర్ 30, 2050 ఉంటుందని పరంజ్‌పే చెప్పారు. 2018లో రెండు బ్లూ మూన్స్ కనిపించాయని, మొదటిది జనవరి 31న, రెండోది మార్చి 31న జరిగిందని పేర్కొన్నారు. రెండోదానికి కారణం ‘ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉండడం మాత్రమే’ ఉన్నాయని చెప్పారు. కాగా, బ్లూ మూన్‌ను కొన్ని దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు. చలికాలంలో రాత్రిపూట జంతువులను వేటాడటానికి వేటగాళ్లకు ఈ పౌర్ణమి సహకరిస్తుంది. అందుకే దీన్ని హంటర్ మూన్ అంటారు. ఈ నెల 31న మనమంతా ఈ బ్లూ మూన్ వీక్షించవచ్చు. తర్వాత మళ్లీ ఆగస్ట్‌ 31న వీక్షించవచ్చు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.