శనివారం 04 ఏప్రిల్ 2020
Science-technology - Mar 07, 2020 , 15:47:01

కేరళలో బర్డ్‌ ఫ్లూ.. రెండు గ్రామాల్లో గుర్తింపు..

కేరళలో బర్డ్‌ ఫ్లూ.. రెండు గ్రామాల్లో గుర్తింపు..

కోజికోడ్‌: కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో ఉన్న రెండు గ్రామాల్లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలోని కొడియతూర్‌, వెంగేరి గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడాన్ని గుర్తించిన అక్కడి అధికారులు ఆ కోళ్ల రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు. వాటిని విశ్లేషించిన భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌.. ఆ కోళ్లకు బర్డ్‌ ఫ్లూ ఉన్నట్లు నిర్దారించింది. దీంతో ఆ గ్రామాల్లోని కోళ్లతోపాటు పశువులను కూడా తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా 2016లో అళప్పురలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేలాది బాతులు చనిపోగా, ఇప్పుడు మళ్లీ అక్కడ బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. అయితే ఇప్పటికి పరిస్థితి అదుపులోనే ఉందని, భయపడాల్సిన పనిలేదని, అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారని కేరళ రాష్ట్ర అటవీ, పశు సంవర్ధక శాఖ మంత్రి కె.రాజు తెలిపారు. 


logo