శనివారం 23 జనవరి 2021
Science-technology - Nov 20, 2020 , 16:36:48

అలెక్సా వాడేటప్పుడు అలెర్ట్ గా ఉండండి...లేకపోతే ప్రమాదమే...

అలెక్సా వాడేటప్పుడు అలెర్ట్ గా ఉండండి...లేకపోతే ప్రమాదమే...

 హైదరాబాద్ :వాయిస్‌ అసిస్టెంట్‌ పరికరం వల్ల ఎంత ప్రయోజనమో.. అంతే నష్టం కూడా ఉన్నది. అమెజాన్‌ అలెక్సా వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలెక్సా అసిస్టెంట్‌లను సెట్‌అప్‌ చేసే క్రమంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు టెక్ ఎక్స్ పర్ట్స్ . అలెక్సా డివైస్ ను వినియోగించే టప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి... అవేంటంటే..? 

 హిస్టరీ తో అలెర్ట్ గా ఉండాలి... 

అలెక్సాలో సేవ్‌ అయిన హిస్టరీ రికార్డింగ్స్‌ని ఎప్పటికప్పుడు తుడి చేస్తే మంచిది. కానీ.. అమెజాన్‌ సూచనల ప్రకారం హిస్టరీని తొలగిస్తే అలెక్సాని స్మార్ట్‌గా వాడుకోవడానికి వీలుండదు. ఎందుకంటే.. హిస్టరీ ఆధారంగానే మీ అభిరుచులు, అలవాట్లను ట్రాక్‌ చేస్తూ అలెక్సా వేగంగా స్పందిస్తుంది. అందుకే.. అలెక్సాలో ఎలాంటి సమాచారం హిస్టరీగా ఉంటే మంచిదో చెక్‌ చేసుకోవడం అవసరం.

-మ్యూట్‌ చేస్తే మంచిది.. 

గదిలో నిత్యం చెవులు రిక్కించి వినే అలెక్సాని అవసరం లేనప్పుడు టర్న్ ఆఫ్‌ చేయడం శ్రేయస్కారం. అందుకు పరికరం పై భాగంలో ఉండే మ్యూట్‌ బటన్‌ని వాడుకోవచ్చు. దీంతో పొరపాటున వాయిస్‌ రికార్డింగ్‌ అవ్వదు.

కాంటాక్ట్‌ల విషయంలో.. 

అలెక్సా అసిస్టెంట్‌లను సెట్‌అప్‌ చేసే క్రమంలో ఫోన్‌లో కాంటాక్ట్‌లను సింక్‌ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీరు అసిస్టెంట్‌తో ఫోన్‌కాల్స్‌ మాట్లాడకుంటే సింక్‌ చేయొద్దు. దీంతో అసిస్టెంట్‌ చేసే వాయిస్‌ రికార్డింగ్స్‌ పొరబాటున కాంటాక్ట్‌లకు చేరే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఇప్పటికే కాంటాక్ట్‌లను అలెక్సాకి జత చేస్తే అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేసి సింక్‌ అయిన అడ్రస్‌బుక్‌ని తొలగించొచ్చు.

 - వాయిస్‌ ఆర్డరింగ్‌ ను టర్న్‌ఆఫ్‌ చేయాలి... 

ఏదైనా ఆర్డర్‌ చేస్తే చాలు. అమెజాన్‌ ఆన్‌లైన్‌ అంగడి నుంచి అలెక్సా కొనేస్తుంది. అందుకు బిల్ట్‌ఇన్‌గా ఉంటే కమాండ్‌ 'వాయిస్‌ ఆర్డరింగ్‌'. దీన్ని డీఫాల్ట్‌గా ఎనేబుల్‌ చేసి ఉంచితే ఎవరైనా అలెక్సాని అడిగి ఆర్డర్‌ చేయొచ్చు. పిల్లలు ఆకతాయిగా చెప్పినా ఆర్డర్‌ ప్రాసెస్‌ అవుతుంది. ఇలా పొరబాటున ఆర్డర్లు ప్రాసెస్‌ అవ్వకుండా ఉండేందుకు వాయిస్‌ ఆర్డరింగ్‌ని టర్న్‌ఆఫ్‌ చేయడం మంచిది. లేదంటే పిన్‌ నెంబర్‌ పెట్టండి.

-'డ్రాప్‌ ఇన్‌'  చాలా ప్రమాదం.. 

ఒకే ఇంట్లో రెండు మూడు అలెక్సా పరికరాలు ఉంటే ఇంటర్‌కామ్‌ వాడుకుని మాట్లాడుకోవచ్చు. అందుకు అనుమతి ఇచ్చేదే 'డ్రాప్‌ ఇన్‌' ఆప్షన్‌. దీంతో హాలులో ఉన్నవారితో గదిలో ఉండి మాట్లాడొచ్చు. అంతేకాదు.. ఇంట్లో ఉన్నవారు ఏం మాట్లాడుకుంటున్నారో ఆఫీస్‌ నుంచి వినొచ్చు. అంటే.. అలెక్సాలోని స్పీకర్‌, మైక్‌ రెండింటినీ యాక్సెస్‌ చేయొచ్చు అన్నమాట. మరైతే, వీటిని నిత్యం ఎనేబుల్‌ చేసి ఉంచడం కొంచెం ప్రమాదమే. ఒకవేళ ఇది కనుక హ్యాకర్ల నియంత్రణలోకి  వెళితే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే  అవసరం లేనప్పుడు 'డ్రాప్‌ ఇన్‌' యాక్సెస్‌ని డిసేబుల్‌ చేయడం మంచిది.

-స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ కంపల్సరీ... 

వాడుతున్న వై-ఫై, అమెజాన్‌లకు హ్యాకర్లు కనిపెట్టేందుకు ఆస్కారం లేని బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. ఇళ్లు 'స్మార్ట్‌హోం'లుగా మారుతున్న నేపథ్యంలో కచ్చితంగా సెక్యూరిటీ చిట్కాల్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక అలెక్సా అమెజాన్‌ సర్వీసుల్లో భాగం. దీంతో మీకు ఉన్న అమెజాన్‌ ఎకౌంట్‌లోనే అలెక్సా భాగం అవుతుంది. దీంతో పాటు అమెజాన్‌ ప్రైమ్‌, ఆడిబుల్‌, అమెజాన్‌ ఫొటోస్‌, కిండిల్‌.. మరిన్ని సర్వీసులు అమెజాన్‌ ఎకౌంట్‌తోనే యాక్సెస్‌ చేయొచ్చు. అందుకే క్లిష్టమైన పాస్‌వర్డ్‌ ఎకౌంట్‌కి అనివార్యం అని గ్రహించాలి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo