e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News గేమింగ్ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బ్యాటిల్ గ్రౌండ్స్ టోర్న‌మెంట్ గెలిస్తే కోటి రూపాయ‌లు ప్రైజ్ మ‌నీ

గేమింగ్ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బ్యాటిల్ గ్రౌండ్స్ టోర్న‌మెంట్ గెలిస్తే కోటి రూపాయ‌లు ప్రైజ్ మ‌నీ

గేమింగ్ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బ్యాటిల్ గ్రౌండ్స్ టోర్న‌మెంట్ గెలిస్తే కోటి రూపాయ‌లు ప్రైజ్ మ‌నీ

ప‌బ్జీకి ఇండియ‌న్ అవ‌తార్‌గా వ‌చ్చిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌.. వ‌చ్చి రాగానే సంచ‌ల‌నాలు సృష్టించింది. ప్లే స్టోర్‌లో కేవ‌లం వారం రోజుల్లోనే 3 కోట్ల‌కు పైగా గేమింగ్ ప్రియులు ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ గేమ్‌పై మ‌రింత ఆద‌ర‌ణ పెంచేందుకు క్రాప్ట‌న్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్స్ సీజ‌న్ 21 పేరిట ఓ టోర్న‌మెంట్‌ను ప్ర‌క‌టించింది. ఈ టోర్న‌మెంట్‌లో ఆడి గెలిస్తే ఏకంగా కోటి రూపాయ‌లు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. అయితే ఈ ప్రైజ్ మ‌నీని.. ఈ టోర్న‌మెంట్‌లో మొద‌టి 16 స్థానాల్లో నిలిచిన వారికి పంచ‌నున్నారు.

గేమింగ్ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బ్యాటిల్ గ్రౌండ్స్ టోర్న‌మెంట్ గెలిస్తే కోటి రూపాయ‌లు ప్రైజ్ మ‌నీ

గేమ్‌లో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.50 ల‌క్ష‌లు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న‌వారికి రూ.25 ల‌క్ష‌లు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.10 ల‌క్ష‌లు, నాల్గో స్థానంలో నిలిచిన వారికి రూ.3 ల‌క్ష‌లు, ఐదో స్థానంలో నిలిచిన వారికి రూ.2ల‌క్ష‌లు, ఆరో స్థానంలో నిలిచిన వారికి రూ.1.5 ల‌క్ష‌లు, ఏడో స్థానంలో నిలిచిన వారికి ల‌క్ష రూపాయ‌లు ప్రైజ్‌గా ఇవ్వ‌నున్న‌ట్లు క్రాప్ట‌న్ సంస్థ ప్ర‌క‌టించింది. ఇక ఎనిమిదో స్థానం నుంచి 16వ స్థానం వ‌ర‌కు ఒక్కో ర్యాంకు త‌గ్గిన కొద్ది రూ.10వేలు త‌గ్గించి ప్రైజ్ మ‌నీ ఇవ్వ‌నున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఎనిమిదో స్థానంలో నిలిచిన వారికి రూ.90 వేలు ఇస్తే.. తొమ్మిదో స్థానంలో నిలిచిన వారికి రూ.80వేలు.. ఇలా చివ‌ర‌గా 16వ స్థానంలో నిలిచిన వారికి 10వేల రూపాయ‌లు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్నారు.

గేమింగ్ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బ్యాటిల్ గ్రౌండ్స్ టోర్న‌మెంట్ గెలిస్తే కోటి రూపాయ‌లు ప్రైజ్ మ‌నీ

ప్లేయర్లు టోర్నమెంట్‌లో ఎలా పాల్గొనాలి

- Advertisement -

ఈ టోర్న‌మెంట్‌లో పాల్గొనేందుకు జూలై 19 నుంచి రిజిస్ట్రేష‌న్లు మొద‌లు కానున్నాయి. ఆగ‌స్టు 2 నుంచి ఆగ‌స్టు 8 మ‌ధ్య‌లో క్వాలిఫయ‌ర్ గేమ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ గేమ్ ఆడాలంటే క‌చ్చితంగా భారతీయులై ఉండాలి. ప్లేయిర్ అకౌంట్ ప్లాటిన‌మ్ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంకింగ్‌ది అయి ఉండాలి. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సీజ‌న్ 2021కి రిజ‌స్ట‌ర్ చేసుకున్న ప్లేయ‌ర్లు మొత్తం 15 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ 15 మ్యాచ్‌ల్లోని టాప్ 10 మ్యాచ్‌ల‌ ఆధారంగా స్కోరింగ్ ఇస్తారు. టాప్‌లో నిలిచిన 1024 టీమ్‌ల‌ను త‌ర్వాత రౌండ్‌కు క్వాలిఫై చేస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

గూగుల్‌లో వీటిని అస‌లు సెర్చ్ చేయ‌కూడ‌దు!

మ‌ల్టీపుల్ డివైజ్‌ల‌లో వాట్సాప్‌.. బీటా యూజ‌ర్ల‌కు కొత్త ఫీచ‌ర్‌

వాట్సాప్‌ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు

వాట్సాప్‌ ట్రిక్స్ : కాంటాక్ట్‌లో లేని నంబర్‌కు మెసేజ్‌ చేయడమెలా

దూసుకెళ్తున్న‌ ప‌బ్‌జీ ఇండియా వ‌ర్ష‌న్‌.. వారంలోనే 3 కోట్ల‌కు పైగా డౌన్‌లోడ్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement