సోమవారం 06 జూలై 2020
Science-technology - Jun 30, 2020 , 09:31:54

జియో జిగేల్‌.. ఒక్క నెలలోనే 62లక్షల కొత్త సబ్‌స్ర్కైబర్లు

జియో జిగేల్‌.. ఒక్క నెలలోనే 62లక్షల కొత్త సబ్‌స్ర్కైబర్లు

న్యూఢిల్లీ:  భారత టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో జోరు కొనసాగుతోంది. జియో ఎంట్రీ తర్వాత  అన్ని  నెట్వర్క్ లకు  క్రమంగా వినియోగదారులు తగ్గిపోతున్నారు.  అధిక  మార్కెట్‌ వాటా సొంతం చేసుకున్న  జియో  దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో  జియో కొత్తగా 62.57 లక్షల సబ్‌స్ర్కైబర్లను జతచేసుకున్నది. దీంతో మొత్తం చందాదారుల సంఖ్య 38.28కోట్లకు పెరిగింది. ఇదే నెలలో వొడాఫోన్‌ ఐడియా(మొత్తం కస్టమర్లు 32.55కోట్లు) 34.67 లక్షల సబ్‌స్క్రైబర్లను  కోల్పోయింది. 

మొబైల్‌, ల్యాండ్‌ఫోన్‌ చందాదార్ల సంఖ్య ఫిబ్రవరి చివరినాటికి 118కోట్లుగా ఉందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ పేర్కొంది. చందాదారుల పరంగా రెండో స్థానంలో ఉన్న  భారతీ ఎయిర్‌టెల్‌ 9.2 లక్షల మంది కొత్త వినియోగదారులను  జతచేసుకోవడం ద్వారా కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 32.90కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌(మొత్తం 11.99కోట్లు) 4.39లక్షల  సబ్‌స్ర్కైబర్లను  జతచేసుకున్నది. 


logo