వాషింగ్టన్: ఆపిల్ సంస్థ సంగతి తెలుసు కదా. ఐఫోన్ పేరుతో మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి సంచలనాలు సృష్టించింది. ప్రతి ఏటా ఓ కొత్త మోడల్‌ను తీసుకొస్తూ వాటిలో తనదైన ప్రత్యేకతను చాటుతూనే ఉంటుంది. అయితే ఆ ఫోన్‌కు తగినట్లే వాటి ధరలు కూడా అదిరిపోతాయి. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ధరలు చాలా ఎక్కువ. ఆపిల్ సంస్థ తీసుకొచ్చే ప్రతి ప్రోడక్ట్ ధర ఇలాగే ఉంటుంది. అయితే తాజాగా తమ ఐఫోన్ల స్క్రీన్‌ను తుడవడానికంటూ ఓ చిన్న క్లాత్‌ను ఆపిల్ రిలీజ్ చేసింది.
దీని ధర చూస్తే దిమ్మదిరిగిపోవడం ఖాయం. ఓ మూలన ఆపిల్ లోగోతో మార్కెట్లోకి వచ్చిన ఈ క్లాత్ ధర 19 డాలర్లు (రూ.1424). ఇండియాలో దీని ధరను రూ.1900గా నిర్ణయించింది ఆ సంస్థ. ఐఫోన్ 6 మొదలుకొని ఆ తర్వాత వచ్చిన అన్ని ఫోన్ల స్క్రీన్లను దీంతో శుభ్రం చేసుకోవచ్చని ఆ సంస్థ చెప్పింది. ఈ క్లాత్‌కు భారీగానే డిమాండ్ ఉన్నా.. అందుకు తగినట్లు సరఫరా మాత్రం లేదు. దీంతో కొరత ఏర్పడింది. సోమవారం రెండు కొత్త మ్యాక్‌బుక్ ప్రొ మోడల్స్‌ను రిలీజ్ చేస్తూ వాటితోపాటు ఈ క్లాత్‌ను కూడా తీసుకొచ్చింది.