మంగళవారం 11 ఆగస్టు 2020
Science-technology - Jul 05, 2020 , 18:04:00

చైనాకు షాకిచ్చిన ఆపిల్‌

చైనాకు షాకిచ్చిన ఆపిల్‌

బీజింగ్: చైనాకు దిగ్గజ మొబైల్‌ సంస్థ ఆపిల్ షాకిచ్చింది. చైనీస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి దాదాపు 4,500 గేమ్స్‌లను ఆపిల్ సంస్థ తొలగించింది. తమ ఇంటర్నెట్ విధానాలను పాటించాలని చైనా ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడిలతో ఆపిల్‌ గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతోంది. చివరకు వారి ఒత్తిడిలకు తలొగ్గకూడదని నిర్ణయించింన ఆపిల్‌ సంస్థ.. చైనా యాప్ స్టోర్ నుంచి గేమ్స్‌ తొలగించాలనే నిర్ణయానికొచ్చింది. 

గత మూడు రోజుల్లోనే ఆపిల్ యొక్క చైనా యాప్ స్టోర్ నుంచి 3,000 కు పైగా ఆటలు తొలగించబడ్డాయి. కొత్త నిబంధనలను అనుసరించి చైనా యొక్క ఆపిల్ యాప్ స్టోర్‌లో  యాప్‌లను అప్‌లోడ్ చేయడానికి ముందు గేమ్ డెవలపర్లు చైనీస్ రెగ్యులేటర్ల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. గేమింగ్‌ లైసెన్స్‌ నింబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన యాపిల్‌.. దానిలో భాగంగానే చైనా గేమ్స్‌ను‌ తొలగించినట్లు ప్రకటించింది. చట్టపరమైన అనుమతి లేని గేమ్స్‌ కూడా యాప్స్‌లో ఉంచుతున్నారని, ఇక మీదట అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నది.

ఈ నెల 1 వ తేదీన 1,571, 2 న 1,805, 3 న 1,276 యాప్‌లను తొలగించారు. చైనా కొత్త ఆంక్షల కారణంగా మొత్తం 20,000 యాప్‌లు ప్రభావితమవుతాయని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సార్ టవర్ నుంచి అందిన డేటా ప్రకారం.. చైనా ఏడాదికి 16.4 బిలియన్ డాలర్ల అమ్మకాలతో ఆపిల్ యొక్క అతిపెద్ద యాప్ స్టోర్ మార్కెట్ కలిగివున్నది. అమెరికాలో ఈ గణాంకాలు సంవత్సరానికి 15.4 బిలియన్లుగా ఉన్నది. ఆపిల్ ప్రస్తుతం చైనాలో సుమారు 60,000 గేమ్స్‌ నిర్వహిస్తోంది. మార్కెట్ పరిశోధన సంస్థ న్యూజూ ప్రకారం.. చైనాలో మొత్తం మొబైల్ గేమ్ ఆదాయంలో ఐఓఎస్‌ 53 శాతం (దాదాపు 13 బిలియన్‌ డాలర్లు) సంపాదించవచ్చు. యాప్ స్టోర్ ద్వారా అత్యధికంగా చైనా ఆదాయం పొందుతున్నది. ఎక్కువ ఆదాయం గేమింగ్ నుంచే వస్తుండటం విశేషం. ఈ పరిణామం చైనా కంపెనీలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


logo