గురువారం 09 ఏప్రిల్ 2020
Science-technology - Mar 10, 2020 , 14:19:34

ఆ ఐప్యాడ్లను ఉచితంగా రిపేర్‌ చేసి ఇవ్వనున్న ఆపిల్‌..!

ఆ ఐప్యాడ్లను ఉచితంగా రిపేర్‌ చేసి ఇవ్వనున్న ఆపిల్‌..!

సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్‌ తన ఐప్యాడ్‌ ఎయిర్‌ మోడల్స్‌కు ఉచిత రిపేర్‌ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఆ ఐప్యాడ్‌లలో బ్లాంక్‌ స్క్రీన్‌ సమస్య  వస్తున్నందున వాటిని ఉచితంగా రిపేర్‌ చేసి ఇస్తామని ఆపిల్‌ తెలిపింది. అయితే కేవలం 2019 మార్చి నుంచి అక్టోబర్‌ నెలల మధ్య తయారైన ఐప్యాడ్‌ ఎయిర్‌ మోడల్స్‌లోనే ఈ సమస్య వస్తుందని ఆపిల్‌ తెలిపింది. కనుక సదరు మోడల్స్‌ను వాడుతున్న యూజర్లు ఎవరైనా సరే.. తమకు సమీపంలోని ఆపిల్‌ ఆథరైజ్డ్‌ సర్వీస్‌ సెంటర్‌లోకి వెళ్లి సమస్య ఉన్న తమ ఐప్యాడ్‌ ఎయిర్‌ ట్యాబ్‌లను ఉచితంగా రిపేర్‌ చేయించుకోవచ్చని ఆపిల్‌ తెలిపింది. 


logo