శనివారం 24 అక్టోబర్ 2020
Science-technology - Jul 23, 2020 , 14:25:45

యాపిల్‌ ఐఫోన్‌ 12 లాంచ్‌ ఎప్పుడంటే..!

యాపిల్‌ ఐఫోన్‌ 12 లాంచ్‌ ఎప్పుడంటే..!

వాషింగ్టన్‌:  ప్రతి ఏడాది  సెప్టెంబర్ నెలలో యాపిల్‌ సరికొత్త ఐఫోన్లను లాంచ్‌ చేస్తుంటుంది. స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  ఐఫోన్‌ 12  మోడళ్ల విడుదల ఈ ఏడాది ఆలస్యం కావచ్చు.    ఎల్‌టీఈ ఐఫోన్‌ 12 మోడళ్లను అక్టోబర్‌ చివరి వారంలో  లాంచ్‌ చేయాలని యాపిల్‌ యోచిస్తుండగా  5జీ   వేరియంట్లు నవంబర్‌ తర్వాత    మార్కెట్లో  అందుబాటులోకి తేవాలని చూస్తున్నది. ఈ ఏడాది యాపిల్ నాలుగు ఐఫోన్ మోడల్స్‌ను  ఆవిష్కరిస్తుందని సమాచారం. 

సెప్టెంబర్‌లోనే ఐఫోన్‌ 12 ఫోన్లను రిలీజ్‌ చేయాలనుకున్నప్పటికీ కరోనా సంక్షోభం కారణంగా విడుదల వాయిదా పడుతున్నదని ఐఫోన్ల తయారీతో సంబంధం ఉన్న కంపెనీ తెలిపింది.   ఐఫోన్‌ 12 ప్రొ 6.1 అంగుళాలు లేదా 6.7 అంగుళాల సైజులో విడుదల కావొచ్చు. ఇటీవల ఆవిష్కరించిన యాపిల్‌ ఐపాడ్‌ ప్రొ మాదిరిగా రియర్‌ కెమెరా మాడ్యుల్‌లో నాలుగు సెన్సార్లతో  లైడార్‌ స్కానర్‌ను కలిగి ఉంటుందని సమాచారం. 


logo