మంగళవారం 11 ఆగస్టు 2020
Science-technology - Jul 09, 2020 , 20:25:00

ఆండ్రాయిడ్‌ యూజర్లకు శుభవార్త..

ఆండ్రాయిడ్‌ యూజర్లకు శుభవార్త..

న్యూయార్క్‌: ఆండ్రాయిడ్‌ యూజర్లకు శుభవార్త. గూగుల్ తన తాజా ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 11కు సంబంధించిన లాంచ్‌ డేట్‌ను ప్రకటించింది. గతేడాది లాంచ్ అయిన ఆండ్రాయిడ్ 10కు అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా ఆండ్రాయిడ్ 11 రానుంది. అమెరికాలో ఇటీవల జరిగిన 'హే గూగుల్' స్మార్ట్ హోమ్ సమ్మిట్‌లో గూగుల్ ఈ తేదీని వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న ఆండ్రాయిడ్ 11ను విడుదల చేస్తున్నట్లు గూగుల్‌ స్మార్ట్‌హోమ్‌ డివిజన్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మిచెల్‌ టర్నర్‌ వెల్లడించారు.  

ఇక ఆండ్రాయిడ్ 11 విషయానికి వస్తే.. ఇందులో గూగుల్ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టింది. అదే పీపుల్, కంట్రోల్స్, ప్రైవసీ, ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌కు నోటిఫికేషన్లు, యాప్స్ పిన్నింగ్, సెక్యూరిటీ విషయాల్లో ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానిక స్క్రీన్ రికార్డింగ్, వీడియోలను రికార్డ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ ధ్వనిని మ్యూట్ చేయడం, గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు అనుగుణంగా డిస్ప్లేల  టచ్ సున్నితత్వాన్ని పెంచడం, లాగింగ్ నోటిఫికేషన్ లాంటివి ప్రత్యేక ఫీచర్లు ఆపరేటింగ్‌ సిస్టంపై అందుబాటులోకి రానున్నాయి.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo