సోమవారం 25 మే 2020
Science-technology - Mar 29, 2020 , 16:55:14

శానిటైజ‌ర్ల‌ను రూపొందించిన అలీఘ‌ర్ యూనివ‌ర్సిటీ !

శానిటైజ‌ర్ల‌ను రూపొందించిన అలీఘ‌ర్ యూనివ‌ర్సిటీ !

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా శానిటైజ‌ర్ల‌ను అలీఘ‌ర్ యూనివ‌ర్సిటీ త‌యారుచేసింది. క‌రోనా నేప‌థ్యంలో హ్యాండ్ శానిటైజర్, గది క్రిమిసంహారక మందును ఏఎల్‌యూ వైస్ చాన్స్‌ల‌ర్ ప్రొఫెస‌ర్ తారీక్ మ‌న్సూర్ ప్ర‌క‌టించారు. ఈ ఉత్ప‌త్తుల‌కు అల్మా మ్యాట‌ర్ క‌రోనా శానిటైజ‌ర్‌, అల్మా మ్యాట‌ర్ క‌రోనా డిస్ఇన్ఫెక్ట్ అని పేరు పెట్టారు. 

ఈ ఉత్ప‌త్తుల‌ను కెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్ట‌ర్ అనామిక గుప్తా, క‌మ్యూనిటీ కాలేజీకి చెందిన డా. రిజ్వాన్ హుస్సేన్‌లు రూపొందించారు. ఈ ఉత్ప‌త్తుల‌ను జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ మెడిక‌ల్ కాలేజీలోని  మైక్రోబ‌యాల‌జీ విభాగంలో ప‌రీక్షించారు. ఈ ఉత్ప‌త్తులు చేతుల‌ను శుభ్ర‌ప‌ర్చ‌డానికి, గ‌దులు, టేబుల్స్‌, కుర్చీలు, చెక్క‌, ఉక్కు త‌లుపులు ఇత‌ర నాన్ లీవింగ్ ఉప‌రిత‌లాల‌ను క్రిమి సంహార‌క‌మందు బాగా స‌హాయ‌ప‌డుతుంద‌ని ప్రొఫెస‌ర్ బేగ్ పేర్కొన్నారు. 


logo