కొందరికి కూల్‌డ్రింక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎక్కడికెళ్లినా కూల్‌డ్రింక్‌ను తెగ తాగేస్తుంటారు. యూఎస్‌లోని న్యూయార్క్‌కు చెందిన ఎరిక్ బూకర్ కూడా అంతే. తనకు కూల్‌డ్రింక్స్ అంటే ప్రాణం. అదే ఇప్పుడు తనకు గుర్తింపును తీసుకొచ్చింది.
ఆ అలవాటే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి పెట్టింది. మామూలుగా ఒక లీటర్ కూల్‌డ్రింక్ తాగాలంటేనే కొంచెం కొంచెం తాగుతాం. ఒక్క గ్లాస్ తాగగానే కడుపు నిండిపోతుంది. కానీ.. ఈయన మాత్రం రెండు లీటర్ల సోడాను గడగడా తాగేశాడు. అటు చూసి ఇటు చూసేలోపు.. 18.45 సెకండ్లలో 2 లీటర్ల సోడాను తాగేశాడు.
దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఎరిక్‌కు వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఎరిక్‌కు ఏదైనా ఫాస్ట్‌గా తినడం, తాగడం అలవాటు. అలా.. అంత వేగంగా సోడాను కూడా తాగేశాడు.
ఇక.. ఎరిక్ వృత్తి విషయానికి వస్తే.. ఎరిక్ ఒక రాపర్. ఇప్పటి వరకు 9 రాప్ సాంగ్స్‌ను రిలీజ్ చేశాడు. ఇక.. ఎరిక్ తాగిన సోడా వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. తమ యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.