బుధవారం 27 జనవరి 2021
Science-technology - Jan 13, 2021 , 14:59:16

జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారా.. అమెజాన్ బంపర్‌ ఆఫర్‌

జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారా.. అమెజాన్ బంపర్‌ ఆఫర్‌

బెంగ‌ళూరు: ఇ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్.. ఇండియాలో ఆన్‌లైన్ అకాడ‌మీని ప్రారంభించింది. జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అమెజాన్ అకాడ‌మీ పేరుతో ఆన్‌లైన్ క్లాస్‌లు అందిస్తోంది. క‌రోనా కార‌ణంగా ఇప్పుడు చ‌దువుల‌న్నీ ఆన్‌లైన్ బాట ప‌ట్ట‌డంతో అమెజాన్ కూడా ఆ దిశ‌గా అడుగులు వేసింది. ఈ అమెజాన్ అకాడ‌మీ.. వెబ్‌సైట్‌, ఆండ్రాయిడ్ యాప్ రూపంలో విద్యార్థుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇందులో లెర్నింగ్ మెటీరియ‌ల్‌, లైవ్ లెక్స‌ర్లు, అసెస్‌మెంట్లు ఉంటాయ‌ని అమెజాన్ ఇండియా వెల్ల‌డించింది. 

అన్నీ ఉచిత‌మే..

ప్ర‌స్తుతానికి ఇందులోని కంటెంట్ అంతా విద్యార్థుల‌కు ఉచితంగానే అందుబాటులో ఉంది. మ‌రికొన్ని నెల‌లు కూడా వీటిని ఉచితంగానే అందిస్తున్న‌ట్లు అమెజాన్ ఇండియా చెప్పింది. ప్ర‌తి ఏటా జేఈఈకి ప్రిపేర‌వుతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిష‌న్ల కోసం ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. కరోనా మ‌హమ్మారి కార‌ణంగా ఇండియాలో ఆన్‌లైన్ ఎడ్యుకేష‌న్‌కు డిమాండ్ పెరిగిపోయింది. 2022 క‌ల్లా 1 నుంచి 12వ త‌ర‌గ‌తిలోపు ఆన్‌లైన్ ఎడ్యుకేష‌న్ మార్కెట్ విలువ 170 కోట్ల డాల‌ర్ల‌కు చేర‌నున్న‌ట్లు క‌న్స‌ల్టెన్సీ రెడ్‌సీర్ అంచ‌నా వేసింది. 


logo