శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Science-technology - Feb 22, 2021 , 16:37:47

అమెజాన్ ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ ప్రారంభం..40శాతం డిస్కౌంట్‌

అమెజాన్ ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ ప్రారంభం..40శాతం డిస్కౌంట్‌

ముంబై: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ భారత్‌లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ పేరుతో ప్రత్యేక సేల్‌ ప్రారంభించింది. మొబైల్‌ ఫోన్లు, యాక్సెసరీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇవాళ ప్రారంభమైన ఈ సేల్‌ ఈనెల 25 వరకు ఉంటుంది. ఫోన్లు, యాక్సెసరీలపై వినియోగదారులు 40శాతం వరకు రాయితీ పొందవచ్చని అమెజాన్‌ పేర్కొంది.  ఇటీవల మార్కెట్లోకి విడుదలైన శాంసంగ్‌ ఎం2, శాంసంగ్‌ ఎం2ఎస్‌, రెడ్‌మీ 9 పవర్‌, ఎంఐ 10ఐ తదితర ఫోన్లు సేల్‌లో ఉన్నాయి.  వన్‌ప్లస్‌, షియోమీ, శాంసంగ్‌, యాపిల్‌, టెక్నో, హానర్‌, లావా తదితర బ్రాండ్లు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలు  ద్వారా వినియోగదారులు 10శాతం తక్షణ తగ్గింపు 1,250 వరకు పొందొచ్చు.  ప్రైమ్‌ మెంబర్స్‌  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐతో  2,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. 

VIDEOS

logo