బుధవారం 03 మార్చి 2021
Science-technology - Feb 23, 2021 , 18:19:40

అమెజాన్‌ గ్రాండ్‌ గేమింగ్‌ డేస్‌ సేల్‌..భారీ డిస్కౌంట్లు

అమెజాన్‌ గ్రాండ్‌ గేమింగ్‌ డేస్‌ సేల్‌..భారీ డిస్కౌంట్లు

ముంబై: ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ సోమవారమే  ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా గేమింగ్‌ ప్రియుల కోసం మరో స్పెషల్‌ సేల్‌ గ్రాండ్‌ గేమింగ్‌ డేస్‌ను తీసుకొచ్చింది. గేమింగ్‌ గ్యాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, యాక్సెసరీలు తదితర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్‌ ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుంది.  హై రిజల్యూషన్‌ కలిగిన  లార్జ్‌ స్క్రీన్‌ టీవీలపై 30శాతం వరకు తగ్గింపు ఉంది.  

దాంతో పాటు ఎంపిక చేసిన మోడళ్లపై నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందిస్తున్నది. గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, అధునాతన హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, గ్రాఫిక్ కార్డులు, లెనోవా, ఎసెర్, ఆసుస్, ఎల్‌జి, హెచ్‌పి, సోనీ, డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్‌,  ప్రముఖ బ్రాండ్ల నుంచి టీవీలను అమ్మకానికి ఉంచింది.   


VIDEOS

logo