e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News Alexa : అలెక్సా.. కోవిడ్ 19 వాక్సిన్ సెంట‌ర్లు ఎక్క‌డున్నాయో చెప్పు?

Alexa : అలెక్సా.. కోవిడ్ 19 వాక్సిన్ సెంట‌ర్లు ఎక్క‌డున్నాయో చెప్పు?

అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాలో కొత్త ఫీచ‌ర్ల‌ను యాడ్ చేశారు. కోవిడ్ 19కు సంబంధించిన వ్యాక్సిన్ సెంట‌ర్లు, టెస్టింగ్ సెంట‌ర్లకు సంబంధించిన ఫీచ‌ర్ల‌ను కేవ‌లం భార‌త్ యూజ‌ర్ల కోస‌మే అందుబాటులోకి తీసుకొచ్చింది అమెజాన్. ఇండియా వ్యాప్తంగా ఎక్క‌డెక్క‌డ కోవిడ్ 19 వ్యాక్సిన్ సెంట‌ర్లు ఉన్నాయి.. ఎక్క‌డ టెస్టింగ్ సెంట‌ర్లు ఉన్నాయి. ద‌గ్గ‌ర్లోని వ్యాక్సిన్ సెంట‌ర్, వ్యాక్సిన్ వేస్తున్నారా? లేక వ్యాక్సిన్ కొర‌త ఉందా? లాంటి అన్ని వివ‌రాల‌ను ఇప్పుడు అలెక్సాను అడిగి తెలుసుకోవ‌చ్చు.

అలెక్సా అందించే స‌మాచారం మొత్తం.. కోవిన్ పోర్ట‌ల్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్ సైట్, మ్యాప్ మై ఇండియా నుంచి తీసుకునేదే కాబ‌ట్టి.. అలెక్సా ఇచ్చే స‌మాధానం నూటికి నూరు శాతం క‌రెక్ట్‌గా ఉంటుందని అమెజాన్ వెల్ల‌డించింది.

- Advertisement -

అలెక్సా క‌మాండ్స్‌తో యూజ‌ర్లు.. కోవిడ్ 19 వెల్ఫేర్ కోసం డ‌బ్బు డొనేట్ కూడా చేయొ్చు. ఇప్ప‌టికే కోవిడ్ 19 ఫీచ‌ర్స్‌ను గ‌త ఎప్రిల్‌లోనే యూఎస్‌లో ప్రారంభించారు. తాజాగా ఇండియాలో కూడా ఈ సేవ‌ల‌ను ప్రారంభించారు.

అలెక్సా.. కోవిడ్ 19 టెస్ట్ ఎక్క‌డ చేయించుకోవాలి? అలెక్సా.. కోవిడ్ వ్యాక్సిన్ ఎక్క‌డ వేసుకోవాలి? అలెక్సా.. నాకు ద‌గ్గ‌ర్లో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ సెంట‌ర్ ఏదో చెప్పు?, అలెక్సా్.. నాకు ద‌గ్గ‌ర్లో ఉన్న కోవిడ్ టెస్ట్ సెంట‌ర్ ఎక్క‌డ ఉందో చెప్పు?.. ఇలాంటి కోవిడ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌ను అడ‌గొచ్చు. కోవిడ్‌కు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా అలెక్సా స‌మాధానం ఇస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana