బుధవారం 15 జూలై 2020
Science-technology - Apr 24, 2020 , 13:04:41

రూ. 401 ప్లాన్‌పై ఉచితంగా 'డిస్నీ+హాట్‌స్టార్'

రూ. 401 ప్లాన్‌పై  ఉచితంగా 'డిస్నీ+హాట్‌స్టార్'

ముంబై:  ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ వినూత్న ప్లాన్‌ను తీసుకొచ్చింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ ప్రకటించింది. రూ.401 డేటా ప్లాన్‌ఫై ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ను అందిస్తోంది.    హాట్‌స్టార్‌తో కలిసి డిస్నీ ఇటీవల భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  రూ.401 కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌తో డేటా బెనిఫిట్స్‌తో పాటు  'డిస్నీ+హాట్‌స్టార్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎయిర్‌టెల్‌ వినియోగదారులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.   'డిస్నీ+హాట్‌స్టార్' తెలుగు సహా పలు భారతీయ భాషల్లో కంటెంట్‌ని అందిస్తోంది. 

రూ.401 డేటా ప్యాక్‌తో ఎలాంటి వాయిస్‌ కాలింగ్‌, ఎస్సెమ్మెస్‌ ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్‌ ద్వారా కేవలం 28 రోజుల పాటు రోజుకు ౩జీబీ డేటా లభించనుంది. ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ 365 రోజుల పాటు వర్తించనుంది. సాధారణంగా డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ.. ధర  ఏడాదికి రూ.399.  అంటే 3 జీబీ డేటా కోసం కేవలం రూ.2 మాత్రమే చెల్లిస్తున్నట్టు లెక్క. ఒకవేళ మీరు ఎయిర్‌టెల్‌ కస్టమర్లు అయితే రూ.401 ప్లాన్‌తో రోజుకు 3జీబీ డేటాను పొందొచ్చు. ప్రీపెయిడ్‌ ప్లాన్‌ గడువు ముగిసినప్పటికీ స్ట్రీమింగ్‌ యాప్‌ సేవలను 365 రోజుల పాటు పొందొచ్చు.  రూ.398 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌ ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. 


logo