శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Science-technology - Mar 10, 2020 , 10:57:03

యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ ఆఫర్‌.. 300ఎంబీపీఎస్‌ స్పీడ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్‌..!

యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ ఆఫర్‌.. 300ఎంబీపీఎస్‌ స్పీడ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్‌..!

ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీ యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ తన వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందిస్తున్నది. తమ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను ఉచితంగా 300 ఎంబీపీఎస్‌ స్పీడ్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం మార్చి 31వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ తెలిపింది. ఇక ఈ ఆఫర్‌కు గాను వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుం చెల్లించాల్సిన పనిలేదని, తమ ప్లాన్‌ను ఉచితంగానే అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చని, దీంతో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తాయని ఆ కంపెనీ తెలిపింది. యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ కస్టమర్లు ఆ కంపెనీ యాప్‌లోకి లాగిన్‌ అయి ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఆ కంపెనీ తెలియజేసింది. క‌రోనా వైరస్ నేప‌థ్యంలో వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల సౌక‌ర్యం కోస‌మే ఈ ఆఫర్‌ను అందిస్తున్న‌ట్లు యాక్ట్ ఫైబ‌ర్‌నెట్ తెలిపింది. 


logo