ఆత్మరక్షణలో వాట్సాప్: ప్రైవసీ పాలసీపై అప్డేట్స్

న్యూఢిల్లీ: ఇన్స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఆత్మరక్షణలో పడింది. 2021 ఫిబ్రవరి 8వ తేదీ నుంచి నూతన ప్రైవసీ పాలసీ అమలులోకి తేనున్నామని, దానికి అప్డేట్ కావాల్సిందేనని వాట్సాప్ జారీ చేసిన నోటిఫికేషన్‌పై యూజర్లు, నెటిజన్లు, వివిధ రంగాల ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ రెండోసారి తన నూతన ప్రైవసీ పాలసీపై యూజర్లకు తాజాగా వివరణనిచ్చింది.
యూజర్ల కుటుంబం, స్నేహితుల ప్రైవేట్ మెసేజ్‌లు సెర్చింజన్లలో లీకవుతాయని జరుగుతున్న వదంతులను నమ్మొద్దని కోరింది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు పంపే మెసేజీల ప్రైవసీపై తమ నూతన ప్రైవసీ పాలసీ ఏమాత్రం ప్రబావం చూపబోదని స్పష్టం చేసింది.
కొత్త అప్డేట్ల వల్ల ప్రజల సందేశాల గోప్యతపై ఎలాంటి ప్రభావం పడబోదని స్పష్టం చేసింది. ‘బిజినెస్ మెసేజింగ్ ల్లో కీలక మార్పులతో పాటు తాజా అప్డేట్లో డేటా సేకరణ, వినియోగంపై మరింత పారదర్శకత వస్తుంది’ అని వాట్సాప్ పేర్కొంది.
యూజర్ల సందేశాలను ఎవరూ చదవలేరనీ.. కాల్స్ కూడా ఎవరూ వినలేరని వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్ అమలు చేయనున్న కొత్త ప్రైవసీ పాలసీపై తీవ్ర గందరగోళం నెలకొనడంతో పాటు చాలా మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌ల వైపు తరలుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ తాను ఇచ్చిన వివరణతోపాటు ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోని సమాచారంపై ఒక జాబితాను కూడా విడుదల చేసింది.
‘మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల, సహోద్యోగులు మధ్య జరిగే సంభాషణలు వాట్సాప్‌గానీ, ఫేస్‌బుక్‌గానీ వినబోవు. సందేశాలను చదవడం జరగదు. మీరు షేర్ చేసుకున్న మెసేజీలు మీ మధ్యే ఉంటాయి. ఎందుకంటే మీ సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్‌తో భద్రంచేసి ఉంటాయి. ఈ భద్రతను మేం ఎప్పటికీ బలహీనం చేయబోం. ప్రతి చాట్‌కి మేం లేబుల్ వేయడాన్ని గమనించడం ద్వారా మా చిత్తశుద్ధిని మీరు తెలుసుకోవచ్చు’ అని వాట్సాప్ పేర్కొంది.
కాల్స్‌ని వినడంగానీ, మెసేజ్‌లు చదవడంగానీ తాము చేయబోమనీ.. కాల్స్ లాగ్‌ని కూడా తమ వద్ద ఉంచుకోబోమని తెలిపింది. తాముగానీ, ఫేస్‌బుక్‌గానీ యూజర్లు షేర్ చేసుకున్న లొకేషన్ చూడబోమని వెల్లడించింది.
కాంటాక్ట్‌లను కూడా ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోమనీ.. సందేశాలను కనిపించకుండా సెట్ చేసుకోవచ్చని వాట్సాప్ వివరించింది. గ్రూప్‌లు ఎప్పటికీ ప్రైవేట్‌గానే ఉంటాయనీ.. సందేశాలను బట్వాడా చేసేందుకు తాము గ్రూప్ మెంబర్ షిప్‌ని వినియోగించుకుంటాం అని తెలిపింది. గ్రూపుల్లోని సమాచారాన్ని ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌తో షేర్చేసుకోబోమని స్పష్టం చేసింది. యూజర్లు తమ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చునని కూడా వాట్సాప్ పేర్కొంది.అయితే వాట్సాప్ ఏ సమాచారాన్ని సేకరిస్తుందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం ఆసక్తికర పరిణామం.
ఫేస్బుక్ ఖాతా తెరుస్తున్నప్పుడు ఎలాంటి సమాచారాన్ని మీరు ఇస్తారో.. అలాగే యూజర్ల నుంచి వాట్సాప్ సేకరించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో ఆటోమేటిగ్గా షేర్ చేసుకుంటుంది. దీంతో పాటు మీ యూజర్ యాక్టివిటీని కూడా షేర్ చేసుకుంటుంది. అంటే.. వాట్సాప్‌ని మీరు ఎన్నిసార్లు చూస్తున్నారు, ఏయే ఫీచర్లు వాడుతున్నారు, మీ ఫ్రొఫైల్ ఫోటో, స్టేటస్‌లతో పాటు ‘ఎబౌట్’ ఇన్ఫర్మేషన్ని కూడా ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటుంది.
మీరు ఏ డివైజ్ వాడుతున్నారు, మీ మొబైల్ నెట్వర్క్, ఐపీ అడ్రస్ వంటి డివైజ్ స్థాయి సమాచారాన్ని కూడా వాట్సాప్ సేకరిస్తుంది. డివైస్‌లో లొకేషన్ ఆన్ చేయగానే మీ లొకేషన్ వివరాలను సేకరించడంతో పాటు, లొకేషన్ ఆఫ్ చేసినప్పుడు మీరున్న ప్రాంతాన్ని అంచనా వేసేందుకు ఏరియా కోడ్‌ను సేకరిస్తుంది.
వినియోగదారులు ఎవరితోనైనా లొకేషన్ షేర్ చేసుకుంటే మాత్రం దానికి ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. తాము తీసుకొస్తున్న కొత్త అప్డేట్ తమ సర్వీసులను, ఫేస్బుక్ ఆఫర్లను మరింత అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తుందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- టీమిండియాను చూసి నేర్చుకోండి
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల
- భారీ మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్న శంకర్..!
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు