మంగళవారం 11 ఆగస్టు 2020
Science-technology - Jul 08, 2020 , 16:00:42

పోకో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్

పోకో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్

ఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో సరికొత్త ఫోన్ ను విపణిలోకి విడుదల  చేసింది. "పోకో m2 pro" పేరుతో  రూపొందించింది. ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,   ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కవైపు అందించారు.   వెనకవైపు నాలుగు కెమెరాలు, కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు ఉన్నాయి. ఫ్రన్ట్ సైడ్16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో పాటు బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ గా ఉంది. పోకో m2 pro మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999.అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.   లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo