మంగళవారం 04 ఆగస్టు 2020
Science-technology - Jul 07, 2020 , 18:29:19

హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 బైక్ లాంచ్

హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 బైక్ లాంచ్

ముంబై :హోండా మోటార్‌సైకిల్ , స్కూటర్ ఇండియా బిఎస్ 6 హోండా ఎక్స్-బ్లేడ్‌ ను మార్కెట్ లోకి విడుదల చేశాయి, ఎక్స్-షోరూమ్ (నోయిడా) ధర  1.05 లక్షలుకాగా...రెండు వేరియంట్లలో దేనిని రూపొందించారు . హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 సింగిల్ డిస్క్ , డ్యూయల్ డిస్క్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నది. యువత అభిరుచులకు తగిన విధంగా దీనిని రూపొందించారు. ఎక్స్-బ్లేడ్ BS6 కంప్లైంట్ ఇంజిన్‌తో పాటు స్టైలిష్ రోబో ఫేస్డ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్ కూడా ఉంది. డ్యూయల్ అవుట్‌లెట్ ఎగ్జాస్ట్ కూడా లభిస్తుంది. గ్రాఫిక్స్, వీల్ స్ట్రిప్స్, స్ప్లిట్ గ్రాబ్-రైల్స్, ఫ్రంట్ ఫోర్క్స్ , BS6 కంప్లైంట్ 160 సిసి ఇంజిన్, 13.67 బిహెచ్‌పి & 14.7 ఎన్ఎమ్, సైడ్స్ కోసం స్పోర్టి లుకింగ్ కవర్లు ,లింక్-టైప్ గేర్ షిఫ్టర్ ఉన్నాయి. "కొత్త ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 సక్సెస్ ఓరియెంటెడ్ యువకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని రూపొందించామని"   హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా డైరెక్టర్ ,సేల్స్ అండ్ మార్కెటింగ్, యాద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఫీచర్లను అందిస్తున్నామని ఆయన చెప్పారు. 
logo