మంగళవారం 04 ఆగస్టు 2020
Science-technology - Jul 04, 2020 , 14:48:50

వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్ ‌ఫోన్

 వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్ ‌ఫోన్

హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ మరో బడ్జెట్ ‌ఫోన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన టీజర్‌ను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. డియర్‌ పాస్ట్‌ పేరుతో  వన్‌ప్లస్ ట్విటర్‌, యూట్యూబ్ చానల్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలో టీజర్ ను షేర్‌ చేసింది. ఈ బడ్జెట్‌ ఫోన్‌ను ‘నార్డ్‌’ పేరుతో మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. దీని ధర సుమారు రూ .37,300 గా ఉండవచ్చని అంచనా. 6.4 అంగుళాల డిస్‌ప్లే తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా , డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు , ఆండ్రాయిడ్‌​ 10, క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌765జీ 5జీ  ప్రాసెసర్‌, 10 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటివి ఉన్నాయి.  logo