మంగళవారం 14 జూలై 2020
Science-technology - Jun 28, 2020 , 01:06:16

యూట్యూబ్ ప్రీమియం ను ఉచితం గా ఇలా పొందొచ్చు...

యూట్యూబ్ ప్రీమియం ను ఉచితం గా ఇలా పొందొచ్చు...

బెంగళూరు : యూట్యూబ్‌లో ఏవైనా వీడియోలు లేదా సినిమాలు చూస్తున్నపుడు మధ్యలో వచ్చే ప్రకటనల కారణంగా చాలా మంది ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దీనికి పరిష్కారంగా యూట్యూబ్‌ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అందిస్తున్నది. ఈ సబ్స్క్రిప్షన్ సహాయంతో యూట్యూబ్‌లో మీరు ఎటువంటి కంటెంట్‌ను అయిన సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడవచ్చు. ప్రీమియం సభ్యత్వం సహాయంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యూట్యూబ్‌ను బ్యాక్ గ్రౌండ్ లో అమలు చేయగల సామర్థ్యం , ఓన్లీ-ఆడియో మోడ్‌ను అమలు చేయడం వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

అంటే మీరు ఈ ఫీచర్ సహాయంతో ఇతర యాప్ లను వినియోగిస్తున్నపుడు ఏదైనా క్లిప్ యొక్క ఆడియోను ప్రసారం చేయవచ్చు.  ఫ్లిప్‌కార్ట్ ప్లస్- యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని మొదటి 30-రోజులు ట్రయల్ ఆఫర్ కింద ఉచితంగా తీసుకోవచ్చు. దాని తరువాత కొనుగోలు చేయవచ్చు. యూట్యూబ్ ప్రీమియం అన్ని ప్రయోజనాలను ఉచితంగా పొందడానికి మరొక మార్గం కూడా ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్  కస్టమర్‌ అయితే కనుక 6 నెలల ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. 150 సూపర్ నాణేల ద్వారా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు.  


logo