బుధవారం 08 జూలై 2020
Science-technology - May 28, 2020 , 21:48:49

మళ్ళీ పెరిగిన టిక్ టాక్ రేటింగ్

మళ్ళీ పెరిగిన టిక్ టాక్ రేటింగ్


బెంగళూరు: కొన్నాళ్ల గా భారత దేశంలో టిక్‌టాక్ రేటింగ్స్ తగ్గిపోయాయని ఇండియాలో బ్యాన్ చేస్తారని పలు వార్తలు హల చల్ చేస్తున్నాయి . కొద్దిరోజుల క్రితం ఈ యాప్ రేటింగ్ పూర్తిగా దిగజారిపోయింది. అందుకు భిన్నంగా ఇప్పుడు టిక్‌టాక్‌కు మళ్లీ రేటింగ్ పెరిగింది. టిక్‌టాక్‌ యాప్‌పై వచ్చిన 80 లక్షల నెగటివ్‌ రివ్యూలను గూగుల్ సంస్థ తొలగించింది. దీంతో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ప్లేస్టోర్‌లో టిక్‌టాక్ 4.4 స్టార్‌ రేటింగ్‌తో మళ్లీ యథాస్థానానికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో గూగుల్‌ సంస్థ, టిక్‌టాక్‌తో కుమ్మక్కయిందని అందుకే అంత రేటింగ్ ఇచ్చిందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


logo