ఆదివారం 07 జూన్ 2020
Science-technology - Apr 08, 2020 , 20:28:32

పిల్లల్ని కంటుంది.. గుడ్లూ పెడుతుంది

పిల్లల్ని కంటుంది.. గుడ్లూ పెడుతుంది

భూమి మీద ఉన్న జీవకోటిలో సర్వసాధారణ పునరుత్పత్తి లక్షణాల్లో పిల్లల్ని కనడం ఒకటైతే మరొకటి గుడ్లు పెట్టడం. ఏ జీవి అయినా ఈ రెండు ప్రక్రియల్లో ఏదో ఒకదాన్ని కలిగి ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాలో ఇటీవల గుర్తించిన ఓ బల్లిజాతిలో ఈ రెండు లక్షణాలు ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నది. మూడు వేళ్లలాం బాహ్య నిర్మాణాలుండే ఈ బల్లి వేడి ప్రదేశాల్లో నివసించే సమయంలో గుడ్లు పెడుతూ పునరుత్పత్తి చేస్తుందని, చల్లని ప్రదేశాల్లో ఉన్నప్పడు పిల్లల్ని కంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీకి చెందిన పరిశోధకురాఉ క్యామిల్లా విటింగ్‌టన్‌ తెలిపారు. ఇది అత్యంత అరుదైన లక్షణమని పేర్కొన్నారు.

ఇలాంటి లక్షణాలు ఉన్న జీవిని గుర్తించటం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ అరుదైన సామర్ధ్యాన్ని సంతరించుకోవటానికి ఆ జీవిలో ఉన్న ప్రత్యేక నిర్మాణాలు ఏమిటన్నదానిపై ఇప్పుడు పరిశోధకులు దృష్టి సారించారు. ఈ జీవిలో ఒకే సమయంలో రెండు రకాల పునరుత్పత్తి విధానాలు ఎలా సాధ్యం అవుతున్నాయో తెలియదని విట్టింగ్‌టన్‌ తెలిపారు. కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ అసాధారణమైన వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని జీవుల్లో పునరుత్పత్తి లక్షణాలు మార్చుకొనే మెకానిజం ఉంటుందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయానికి వచ్చారు.  


logo