బుధవారం 03 జూన్ 2020
Science-technology - Apr 03, 2020 , 17:11:42

ప్రతి ఐదుగురిలో ఒకరికి ఎడమచేతివాటం

ప్రతి ఐదుగురిలో ఒకరికి ఎడమచేతివాటం

మన చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఒకరు ఎడమచేతివాటం ఉన్నవారిని గమనిస్తూనే ఉంటాం. సమాజంలో ఎడమచేతివాటం ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అది తప్పట. జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఎడమచేతివాటం ఉన్నవాళ్లేనని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అసలు ఎడమచేతివాటం ఎందుకు వస్తుందనే విషయం శాస్త్రవేత్తలకు చాలాకాలం నుంచి అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది.

యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌, ఏథెన్స్‌లోని నేషనల్‌ అండ్‌ కపోడిస్ట్రెయిన్‌ యూనివర్సిటీ కలిసి నిర్వహించిన ఓ అంతర్జాతీయ సర్వేలో జనాభాలో ఎడమచేతివాటం వారు 18.1శాతం ఉంటారని గుర్తించారు. అయితే వీరిలో శారీరక పనుల కోసం ఎడమచేతివాటాన్ని వాడేవారు 9.34శాతం మాత్రమే ఉంటారని 20 లక్షల మందిని పరిశీలించిన మీదట నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి సర్వేల్లో ఇంతమందిని శాంపిల్‌గా తీసుకోవటం ఇదే మొదటిసారి. ఎడమ, కుడి చేతివాటాల్లో కొందరిలో తేడాలు ఉండటానికి భౌతిక, మానసిక కారణాలు ఏమి ఉంటున్నాయో తెలుసుకొనేందుకు ఈ సర్వే ఫలితాలు ఉపయోగపడుతాయని పరిశోధనకు నాయకత్వం వహించిన సిల్వియా పరాచ్చినీ అభిప్రాయపడ్డారు. 


logo