సోమవారం 25 మే 2020
Science-technology - Apr 02, 2020 , 21:23:10

మార్స్‌పై బ్యాక్టీరియా...?

మార్స్‌పై బ్యాక్టీరియా...?

సౌర కుటుంబంలో భూమికి కవల గ్రహంగా భావించే అంగారకుడిపై బ్యాక్టీరియా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తాజాగా పరిశోధకులు భావిస్తున్నారు. భూమిపై సముద్రాల లోతుల్లో ఉన్న అగ్నిపర్వత రాళ్లపై బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి బ్యాక్టీరియానే అంగారకుడి రాళ్లపై కూడా ఉండవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో పరిశోధకులు అంటున్నారు. ఈ పరిశోధకులు దాదాపు పదేళ్లు శ్రమించి దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలోని లోతైన ప్రాంతాల్లో ఉన్న రాళ్లపై ఏక కణ ఆర్గానిజమ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. మార్స్‌పైకి నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్‌ గతేడాది అక్కడ బంకమన్నుతో కూడి ప్రాంతాలను గుర్తించింది. ఆ బంకమన్నుతో కూడిన రాళ్లపై సముద్రంలోని రాళ్లపై గుర్తించిన జీవిలాంటి గ్రీన్‌ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని టోక్యో యూనివర్సిటీకి చెందిన యోహి సుజికీ అభిప్రాయపడ్డారు. మార్స్‌పై దాదాపు జీవి ఆనవాళ్లను గుర్తించినట్టేనని ఆయన తెలిపారు. ఒకవేళ ఆ బంకమన్నులో స్పష్టమైన జీవం లేకపోయినా అందుకుసంబంధించిన మరో రూపం ఉండవచ్చని అన్నారు. 


logo