ఆదివారం 07 జూన్ 2020
Science-technology - Apr 02, 2020 , 13:05:52

సముద్రాల రక్షణ ఇప్పటికీ సాధ్యమే

సముద్రాల రక్షణ ఇప్పటికీ సాధ్యమే

పర్యావరణ మార్పులతో భూగోళం భగభగ మండుతున్నది. కాలుష్య వ్యర్థాలతో మహాసముద్రాలు నిండుతున్నాయి. దాంతో సముద్రజీవులన్నీ అంతరించిపోతున్నాయి. పర్యావరణ మార్పులను ఆపేందుకు అంతర్జాతీయంగా అనేక సమావేశాలు, చర్చలు జరుగుతున్నప్పటికీ పెద్దగా ప్రయోజనాలేమీ కనిపించటంలేదు. అయితే ఇప్పటికీ సమయం మించిపోలేదని, ప్రయత్నిస్తే 2050 నాటికి సముద్రజీవులను కాపాడవచ్చని చెపుతున్నారు.  

వచ్చే 30 ఏండ్లపాటు సముద్రజీవులు, వాటి ఆవాసాల రక్షణకు సంబంధించి కచ్చితమైన రోడ్‌మ్యాప్‌ సిద్ధంచేసి అమలుచేయగలిగితే మహా సముద్రాల జీవ వైవిద్యాన్ని మళ్లీ యథాస్థానానికి తీసుకురాగలమని సౌదీ అరేబియాలోని కింగ్‌ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్‌ కార్లోస్‌ డార్టే తెలిపారు. వణ్యప్రాణుల రక్షణ, సహజ ఆవాసాల రక్షణ, కాలుష్యాన్ని తగ్గించటం, పర్యావరణ మార్పులు చెడు ప్రభావం చూపకుండా కాపాడటమే రోడ్‌మ్యాప్‌లో అత్యంత కీలకమైన అంశాలని  కార్లోస్‌ డార్టే స్పష్టంచేశారు. 


logo