ఆదివారం 07 జూన్ 2020
Science-technology - Apr 02, 2020 , 10:45:28

5000 ఏండ్ల క్రితమే బలి

5000 ఏండ్ల క్రితమే బలి

ప్రాచీన మధ్యయుగాల్లో ఒక రాజ్యం మరో రాజ్యంపై యుద్ధానికి వెళ్లేముందు దేవతలను ప్రసన్నం చేసుకొనేందుకు జంతుబలులు ఇచ్చేవారని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కొన్నిసార్లు బానిసలను కూడా బలి ఇచ్చేవారని చెపుతారు. భూమిపై ప్రాచీన చరిత్రల్లో ఒకటైన మెసపటోమియాలో వారి యుద్ధ దేవుడైన నింగర్సుకు భారీ ఎత్తున జంతుబలులు ఇచ్చేవారని తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఒకనాడు మెసపటోమియా సామ్రాజ్యం విలసిల్లిన ప్రాంతమే నేటి ఇరాక్‌. అప్పటి నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లకోసం అనేక మంది పురావస్తు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా మెసపటోమియా యుద్ధ దేవుడు నింగిర్సుకు పూజలు నిర్వహించి జంతుబలులు ఇచ్చిన ఒక ప్రాంతాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇరాక్‌లోకి తెల్లో ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో చిన్నచిన్న కప్పులతోపాటు భారీ జార్లు జంతువుల ఎముకలు భారీ ఎత్తున బయటపడ్డాయి. వాటితోపాటు కంచుతో చేసిన బాతు ఆకారంలోని ఓ బొమ్మకూడా లభించిందని లైవ్‌సైన్స్‌ వెల్లడించింది.  


logo