ఆదివారం 07 జూన్ 2020
Science-technology - Apr 02, 2020 , 09:27:04

కరోనాపై ఊపందుకున్న పరిశోధనలు

కరోనాపై ఊపందుకున్న పరిశోధనలు

ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ ప్రాణాంతకంగా మారుతున్న కరోనా వైరస్‌కు వాక్సిన్‌ తయారుచేసే పరిశోధనలు ఊపందుకున్నాయి. కరోనా వైరస్‌ జన్యుక్రమం ఆధారంగా వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు ఫార్మసీ కంపెనీలు శ్రమిస్తున్నాయి. కోవిడ్‌-19 వైరస్‌ బయటపడిన వెంటనే దాని జన్యుక్రమాన్ని గుర్తించిన చైనా దానిని ప్రపంచంతో పంచుకుంది. ఆ జన్యుక్రమం ఆధారంగా పరిశోధనలు సాగుతున్నాయి.

మనిషి జన్యువులో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ అనే జీవ పదార్థాలు ఉంటాయి. ఆ జన్యుపదార్థంపైనే కోవిడ్‌-19 వైరస్‌ దాడిచేస్తుంది. దాంతో రోగి తీవ్రమైన అస్వస్తతకు గురై మరణిస్తాడు. ప్రస్తుతం ఈ వ్యాధి అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో దానికి అంతే వేగంగా వ్యాక్సిన్‌ తయారు చేయాలంటే ఆ వైరస్‌ జన్యుక్రమం ఆధారంగానే సాధ్యమని భారత్‌ సహా ప్రపంచదేశాల శాస్త్రవేత్తలంతా భావిస్తున్నారు. దాని జన్యుక్రమాన్ని అధ్యయనం చేయటం ద్వారా అది ఎలా పెరుగుతుంది. మనిషిపై ఎలా దాడిచేస్తుంది అన్నది తేలికగా అర్థం చేసుకోవచ్చు. తద్వారా వాక్సిన్‌ను రూపొందించటం తేలికవుఉంది.

కోవిడ్‌-19 జీనోమ్‌ ఆధారంగా రూపొందించిన మొదటి వ్యాక్సిన్‌ను రూపొందించిన మోడెర్నా అనే సంస్థ మార్చి 16న మొదటి ట్రయల్స్‌ నిర్వహించింది. చైనాలో ఈ వ్యాక్సిన్‌ ఫేజ్‌ 1 ట్రయల్స్‌ ఈ నెలలో ప్రారంభం అవుతాయి. కోవిడ్‌-19పై జరుగుతున్న వేగవంతమైన పరిశోధనలు ఇతర కరోనా వైరస్‌లకు వ్యాక్సిన్‌ కనుగొనటంలో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడుతాయి అని ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ సీఈవో రిచర్డ్‌ హ్యాచెట్‌ అభిప్రాయపడ్డారు. 


logo