బుధవారం 03 జూన్ 2020
Science-technology - Mar 28, 2020 , 15:03:18

ఎక్స్-57 మాక్స్‌వెల్.. ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్

ఎక్స్-57 మాక్స్‌వెల్.. ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్

విద్యుత్‌తో నడిచే విమానాల తయారీలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద కంపెనీల మధ్య భారీగా పోటీ ఉంది. కొన్ని సంస్థలు సోలార్ విద్యుత్ లేదా బ్యాటరీలతో నడిచే విమానాలను పరీక్షించాయి కానీ అంతగా విజయవంతం కాలేదు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పూర్తిగా విద్యుత్‌తో నడిచే విమానాన్ని ఆవిష్కరించింది. ఎక్స్-57 మాక్స్‌వెల్ అని పిలుస్తున్న ఈ విమానం నాసా గతంలో రూపొందించిన ఇదే తరహా విమానాలకంటే 500 రెట్లు శక్తిమంతమైనది.అంతేకాదు ఈ విమానం ఎలాంటి కాలుష్య ఉద్ఘారాలను విడుదల చేయదని, అతి తక్కువ ధ్వనిని మాత్రమే విడుదల చేస్తుందని నాసా తెలిపింది.

ఈ తరహా విద్యుత్ విమానాల్లో మానవ సహిత విమానం ఇదే మొదటిది. నలుగురు వ్యక్తులు ప్రయానించేందుక వీలుండే ఈ విమానానికి 12 ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. విద్యుత్‌కోసం రీచార్జి చేయగల లిథియం ఆయాన్ బ్యాటరీలను వాడారు. ఈ ఎలక్ట్రిక్ విమానా తయారీ కోసం నాసా రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నది. ఈ పరిశోధకుల బృందంలో ఇంజినీర్లు, సైంటిస్టులు, పైలట్లు, ఆర్టిస్టులు కూడా పాలు పంచుకున్నారు. ఈ విమానం వాణిజ్యపరంగా అందుబాటులోకి రావటానికి మరికొంత సమయం పడుతుంది. logo