సోమవారం 25 మే 2020
Science-technology - Mar 26, 2020 , 11:10:14

మార్కెట్లోకి రానున్న సరికొత్త ద్రోన్లు

మార్కెట్లోకి రానున్న సరికొత్త ద్రోన్లు

టెక్ యుగంలో ఏ పనికైనా వేగం అత్యంత ముఖ్యం. ఎంత వేగంగా పనిచేయగలిగితే అంత విలువ. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు రవాణా అత్యంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేటి కాలంలో సరుకుల డెలివరీలో ద్రోన్ల వాడకం వేగం పుంజుకుంటున్నది. ప్రస్తుతం చాలావరకు అత్యవసర సరుకులకు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉన్న ఈ ద్రోన్ల వాడకం మరికొద్ది రోజుల్లో అన్ని రంగాలకు విస్తరించే అవకాశం ఉందని టెక్ నిపుణుల మాట. 

అమెరికాలో ద్రోన్ల ద్వారా సరుకుల డెలివరీలో ముందున యూపీఎస్ సంస్థ ఈ రంగంలో మరో అడుగు ముందుకేసింది. జర్మనీకి చెందిన ద్రోన్ల తయారీ సంస్థ వింగ్‌కాప్టర్‌తో కలిసి అత్యంత వేగంగా, సమర్థంగా ప్రయాణించగల ద్రోన్ల ఉత్పత్తిని మొదలుపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ద్రోన్లు చాలా నెమ్మగానే ప్రయాణిస్తాయి. అంతేకాకుండా తుఫాన్లు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ద్రోన్లు దాదాపుగా పనిచేయవు. కానీ వింగ్‌కాప్టర్ తయారు చేస్తున్న ద్రోన్లు మాత్రం ఏకంగా 72 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినప్పటికీ స్థిరంగా ప్రయాణించగలవు. అంతేకాదు ఇవి గంటక 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి సరుకులను క్షణాల్లో చేరవేయగలవు. ఇవి ఒకసారి గాల్లోకి ఎగిరితే 120 కిలోమీటర్లు ఏకబిగిన ప్రయాణిస్తాయని యూపీఎస్ డెలివరీ సంస్థ నిర్వాహకుడు బాలగణేశ్ తెలిపారు. ‘వింగ్‌కాప్టర్‌తో యూపీఎస్ భాగస్వామ్యం ద్రోన్ డెలివరీ సర్వీసుల్లో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది’ అని పేర్కొన్నారు. వివిధ రకాల వస్తువుల చేరవేతకు తగ్గట్టుగా వివిధ రకాల ద్రోన్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు. వింగ్‌కాప్టర్ ద్రోన్లు ఐర్లాండ్‌లోని మారుమూల దీవులకు అత్యవతసర మెడిసిన్‌ను చేరవేయటంలో పేరుగాంచాయి. యూనిసెఫ్‌తో కలిసి పరిఫిక్ మహాసముద్రంలోని దాదాపు 80 దీవులకు ఈ ద్రోన్లు సేవలు అందిస్తున్నాయి. 


logo