సోమవారం 06 ఏప్రిల్ 2020
Science-technology - Mar 24, 2020 , 13:03:12

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అలెక్సా క‌ష్టాలు

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అలెక్సా క‌ష్టాలు

క‌రోనా భ‌యంతో  ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగుల‌ను ఇండ్ల‌నుంచే ప‌నిచేయాల‌ని సూచిస్తున్నాయి. అయితే ఇంటి నుంచి ప‌నిచేస్తున్న కొంద‌రు ఉద్యోగుల‌కు ఇప్పుడు ఓ కొత్త క‌ష్టం వ‌చ్చిప‌డింద‌ట‌. నేడు చాలా ఇండ్లు స్మార్ట్‌హోమ్సే క‌దా. ఇంటిలో లైట్ ఆన్ చేయాల‌న్నా అలెక్సాను పిల‌వ‌టం అల‌వాటుగా మారిపోయింది. ఈ స్మార్ట్ డివైసే ఇప్పుడు స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతుంద‌ని వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగులు ల‌బోదిబోమంటున్నారు. ఇంట్లో కూర్చొని స‌హ ఉద్యోగులు, పై అధికారుల‌తో సంస్థ‌కు సంబంధించిన ర‌హ‌స్య స‌మాచారాల గురించి ఫోన్లో మాట్లాడుతున్న‌ప్పుడు అలెక్సాలాంటి స్మార్ట్ డివైస్‌లు విని రికార్డు చేస్తున్నాయ‌ట‌. దాంతో కంపెనీల ర‌హ‌స్యాలు బ‌య‌టికి పొక్కే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్ని కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ఇండ్ల‌లో అలెక్సా , గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి డివైస్‌ల‌ను బంద్ చేయాల‌ని సూచిస్తున్నాయి.  బ్రిట‌న్‌కు చెందిన మిష్‌కాన్ డీ రేయా అనే న్యాయ‌సేవ‌ల కంపెనీ ఈ మేర‌కు త‌న ఉద్యోగుల‌కు ఆదేశాలిచ్చింది. ప‌లు ఇత‌ర కంపెనీలు కూడా ఇదే  స‌ల‌హా ఇస్తున్నాయ‌ని అంత‌ర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.


logo