శనివారం 04 ఏప్రిల్ 2020
Science-technology - Mar 24, 2020 , 11:06:55

అన్ని జీవుల‌కు త‌ల్లి ఇకారియేనా..?

అన్ని జీవుల‌కు త‌ల్లి ఇకారియేనా..?

భూమిపై జీవ‌కోటికి మూలం ఏమై ఉంటుంద‌న్న ప్ర‌శ్న ఎన్నో ఏండ్లుగా శాస్ర‌వేత్త‌ల‌ను వేధిస్తూనే ఉంది. అయితే ఈ ప్ర‌శ్న‌కు ఇప్పుడు స‌మాధానం దొరికింది అంటున్నారు ప‌రిశోధ‌కులు. ఆస్ర్టేలియాలో ఇటీవ‌ల గుర్తించిన ఓ క్రిమి మొత్తం జీవ‌జాలానికి త‌ల్లిలా ఉంద‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివ‌ర్‌సైడ్ ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. వ‌రి గింజ ప‌రిమాణంలో ఉన్న ఈ క్రిమి జాడ‌ల‌ను ఓ రాతిపై గుర్తించారు. ఇది ఇకారియా వారియోషియా జాతికి చెందిన‌ది. ఇది ఐదున్న‌ర కోట్ల ఏండ్ల క్రితం జీవించింద‌ని అంచ‌నా వేశారు. జీవ ప‌రిణామ క్ర‌మంలో మ‌నుషుల‌తో స‌హా నేటి జంతుజాలానికి అతి ద‌గ్గ‌ర‌గా ఉన్న పురాత‌న జీవి ఇదేన‌ని ఘంటాప‌థంగా చెపుతున్నారు. అది జీవించి ఉన్న‌ప్పుడు ఎలా ఉండేది అనే అంశంపై  ఓ కంప్యూట‌ర్ చిత్రం కూడా విడుద‌ల చేశారు.  


logo