బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని సినిమాలతో కన్నా హాట్ ఫొటోస్తోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తరచు తన సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తూ యువతకు కంటిపై కునుకు లేకుండా చేసే ఈ అమ్మడు తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో వర్కవుట్ వీడియో షేర్ చేసింది.
ట్రైనర్ సమక్షంలో 70 కేజీల బరువును అలవోకగా ఎత్తిన దిశా పటాని అందరి మతులు పోగొట్టింది. జిమ్లో చేసిన పలు వర్కవుట్స్ కూడా ఇందులో జత చేయగా, ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ తల్లి ఓ దేషు అనే కామెంట్ చేయగా, యాక్ట్రెస్ ఎల్లిఅవ్రామ్ డామిన్ దిశా అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం దిశా వర్కవుట్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.