సోమవారం 30 మార్చి 2020
Science-technology - Mar 19, 2020 , 22:44:52

నీలితార మహావేగం

నీలితార మహావేగం

మన పాలపుంత కేంద్రం నుంచి విడుదలైన ఒక నీలి నక్షత్రం అసాధారణ వేగంతో ప్రయాణిస్తున్నట్టు శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇది అక్కడి మిగిలిన నక్షత్రాలకంటే 10 రెట్లు అధికమని వారంటున్నారు.

మన గెలాక్సీ (పాలపుంత) కేంద్రానికి చెందిన మహాకాలబిలం (సాగిట్టేరియస్‌-ఏ) సమీప ప్రాంతం నుండి విడుదలైనట్లుగా భావిస్తున్న ప్రకాశవంతమైన నీలి నక్షత్రం ‘ఎస్‌5-హెచ్‌విఎస్‌1’ (S5-HVS1) ప్రయాణవేగం అనూహ్యంగా గంటకు 30 లక్షల మైళ్లుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం ఇది మన భూమికి 29,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వారు తెలిపారు. ఇది ‘సిరియస్‌' వంటి ‘ఏ-టైప్‌' నక్షత్రమేకాక ఇలాంటి తారలను ‘3వ అత్యుష్ణ’ నక్షత్రాలుగా వారు పేర్కొన్నారు. మన సూర్యునికంటే 3 రెట్లు అధిక పరిమాణంలో ద్రవ్యరాశిని కలిగి ఉండే ఈ తారల కాంతి మొత్తం 80 సూర్యుళ్లకు సమానమని వారన్నారు. ‘అత్యధిక వేగవంతమైన నక్షత్రాలు’గా చెప్పే ఈ తారల ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 7,500-11,000 కెల్విన్స్‌ (13,040-19,340 డిగ్రీల ఫారిన్‌హీట్స్‌)గా చెబుతున్నారు. ‘మంత్లీ నోటీసెస్‌ ఆఫ్‌ ది రాయల్‌ అస్ట్రానమికల్‌ సొసైటీ’ పత్రిక ఇటీవలి సంచికలో ఈ పరిశోధన ప్రచురితమైంది.logo