శుక్రవారం 05 జూన్ 2020
Science-technology - Mar 19, 2020 , 22:45:42

గురకకు ఇలా గుడ్‌బై

గురకకు ఇలా గుడ్‌బై

నాలుకపై రెండువైపులా రెండు ఎలక్ట్రోడ్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా నిద్రలో గురకను నిశ్శబ్దంగా మార్చే సాంకేతికతను లండన్‌ వైద్యనిపుణులు సాధించారు. దీనిని మన స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌తోనూ నియంత్రించుకోవచ్చునని వారంటున్నారు.

చిన్న విద్యుత్‌ ప్రవాహకాల (హానికరం కాని)తో గురక శబ్దాన్ని నివారించే పరికరాన్ని లండన్‌లోని ఎన్‌హెచ్‌ఎస్‌ (National Health Service) కు చెందిన నిపుణులు ఇటీవల అభివృద్ధి పరిచారు. స్నూజీల్‌ (Snoozeal) గా పిలుస్తున్న ఈ పరికరాన్ని రోజులో పగటిపూట ఎప్పుడైనా (నిద్రపోని వేళ) నోటివద్ద 20 నిముషాలపాటు, మొత్తం 6 వారాలు ధరించాలి. దీనిద్వారా రెండు ఎలక్ట్రోడ్స్‌ నాలుకకు రెండువైపులా చేరుతాయి. తర్వాత నిద్రించే వేళ వచ్చే గురకను ఇవి ఆటోమేటిక్‌గా శబ్దరహితం చేస్తాయని ఎన్‌హెచ్‌ఎస్‌ సర్జన్‌, నిద్ర రుగ్మతల నిపుణుడు ప్రొ॥ అన్షుల్‌ సామా (Anshul Sama) వెల్లడించారు. దీనిని మన స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌తో ఎప్పటికప్పుడు నియంత్రించుకోవచ్చునని కూడా ఆయన తెలిపారు. ఈ సాంకేతికత 70 శాతం విజయవంతమైందని, పరికరం మార్కెట్లోకి రావడమే తరువాయి అని తెలుస్తున్నది.logo