సోమవారం 30 మార్చి 2020
Science-technology - Mar 18, 2020 , 14:58:33

నెట్ ఫ్లిక్స్‌లో బెస్ట్‌ ప్లాన్‌ ఏదీ?

నెట్ ఫ్లిక్స్‌లో బెస్ట్‌ ప్లాన్‌ ఏదీ?

ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల మాటే. వీటి ద్వారా వినోదం ఆర‌చేతిలోకి చేరుతున్న‌ది. ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో కీల‌కంగా మారిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అందులో మీకు స‌రిపోయే ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలో ఇక్క‌డ చూడండి. 

నెట్‌ఫ్లిక్స్ ప్ర‌ధానంగా నాలుగు ప్లాన్ల‌ను క‌లిగి ఉంది.  మొబైల్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం. మీ అవసరాలకు సరిపోయిన దాన్ని ఎంచుకోవడాన్ని ఇది సులభం చేస్తుంది. మీరు ఎలాంటి ప్లాన్ ఎంచుకున్నా సరే, మీరు ఏ విధమైన ప్రకటనలు చూడరు. ఎప్పుడూ అన్ని భారతీయ మరియు ప్రపంచవ్యాప్తమైన నెట్ ఫ్లిక్స్ సినిమాలకు, సిరీస్ లకు నిరంతరాయ యాక్సెస్ ను కలిగిఉంటారు. మీ అవసరాలకు అనుగుణంగా ఏ సమయంలోనైనా మీరు మీ ప్లాన్ ను అప్ గ్రేడ్ లేదా డౌన్ గ్రేడ్ చేసుకోవచ్చు. 

మీరు మీ నెట్ ఫ్లిక్స్ ప్లాన్ ను నిర్దేశించుకోవడంలో తోడ్పడే మూడు ప్రశ్నలు:

- మీరు ఎవరితో కలసి ఉంటారు – ఒంటరిగా లేదా మీ స్నేహితులు లేదా మీ కుటుంబం ?

- ఆన్ లైన్ వినోదం కోసం మీరు ఉపయోగించే ఉపకరణం ఏది ?

- శబ్దం మరియు వీడియో నాణ్యతకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు ?


మొబైల్ ప్లాన్ :  

మీరు ఒంటరిగా ఉండేటట్లయితే లేదా మీకు నచ్చిన సిరీస్, సినిమాలను మీరు ఒంటరిగా చూడాలనుకుంటే, స్మార్ట్ ఫోన్ మీ ప్రపంచంగా ఉంటే అప్పుడు నెలకు రూ. 199ల మొబైల్ ప్లాన్ మీకు అన్నివిధాలుగా సరి పోతుంది. ఒక సమయంలో ఒక మొబైల్ లేదా టాబ్లెట్ పై మీరు నెట్ ఫ్లిక్స్ ను స్ట్రీమ్ చేయవచ్చు. స్మార్ట్ డౌన్ లోడ్స్   -  గొప్ప మొబైల్ ఫీచర్లను ఇది  అందిస్తుంది. తద్వారా మీరు వైఫై కనెక్షన్ ను బాగా వినియోగించుకోవ డంతో పాటు మీరు చూసిన కూల్ స్టోరీస్ గురించి సోషల్ మీడియాకు షేర్ చేసుకోవచ్చు. 


బేసిక్ ప్లాన్ : 

మీరు  మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీల మధ్య అటూ ఇటూ మారుతూ ఉంటే నెలకు రూ.499 ఉండే బేసిక్ ప్లాన్ మీకు  సరిగా సరిపోతుండవచ్చు. ఒక సమయంలో ఒకే ఉపకరణంపై నెట్ ఫ్లెక్స్ స్ట్రీమ్ అయినా, అన్ని రకాల ఉపకరణాలపై ఇది పని చేస్తుంది. దీంతో మీరు ఉదయం పూట మీ ఫేవరేట్ థ్రిల్లర్ ను మీరు పనికెళ్ళే సమయంలో ఫోన్ లో చూసి ఆ రోజును ప్రారంభించవచ్చు. మధ్యాహ్నం పూట కావాలనుకుంటే లాప్ టాప్ లో చూడవచ్చు లేదంటే ఇంటికి వచ్చిన తరువాత టీవీలో చూడవచ్చు. 

 

స్టాండర్డ్ ప్లాన్ : 

మీరు మీ భాగస్వామి తో నివసిస్తున్నా లేదా ఓ రూమ్ మేట్ తో మీ ఫ్లాట్ ను షేరింగ్ చేసుకుంటున్నా, మీరు నె లకు రూ.649 ల స్టాండర్డ్ ప్లాన్ కు అప్ గ్రేడ్ కావడం మంచిది. 1080 పి (హెచ్ డి) వీడియో తో ఇది ఓ టీవీలో మీ పెట్టుబడిని ఎంతో విలువైందిగా చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ ను ఏక కాలంలో రెండు ఇంటర్నెట్ అనుసంధానిత  ఉప కరణాలపై స్ట్రీమ్ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. 


ప్రీమియం ప్లాన్ :  

మీరు గనుక మీ తల్లిదండ్రులతో కలసి నివసిస్తుంటే లేదా పిల్లలను కలిగిఉంటే, నెలకు రూ.799ల ప్రీమియం ప్లాన్ మీ కుటుంబానికి సరిగ్గా సరిపోయేది అవుతుంది. ఏకకాలంలో టీవీ, లాప్ టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ వంటి నాలుగు ఉపకరణాలపై నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. దీంతో మీ చిన్నారు లు మైటీ లిటిట్ భీమ్ వంటి తాజా అడ్వెంచర్స్ ను ఆనందించవచ్చు. మీరు సాక్రెడ్ గేమ్స్ లో మునిగిపోవచ్చు. మీకు గనుక 4కె టీవీ లేదా తిరుగులేని ఆడియో కలిగిఉంటే ఇది ఇంకెంతో గొప్పగా ఉంటుంది. ఈ ప్లాన్ తో మీరు నెట్ ఫ్లిక్స్ సిరీస్ , సినిమాలను 4కే వీడియో (4కే లో షూట్ చేసిన సినిమాలు, షోల కోసం) ,డాల్బీ అట్మాస్ సౌండ్ ను ఆనందించవచ్చు.logo