బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Mar 17, 2020 , 23:10:09

‘కరోనా’ పాట్లు.. సేఫ్టీకి సూట్లు

‘కరోనా’ పాట్లు.. సేఫ్టీకి సూట్లు

కరోనా వైరస్‌ గడగడలాడిస్తున్నది. దానిబారిన పడకుండా ప్రపంచం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఆయాదేశాల్లో జనాలు గుమిగూడటం, ఇతరులను తాకడం, బయటకు రావడం అసలే చేయట్లేదు. మాస్కులు, గ్లౌజ్‌లు ధరిస్తున్నారు. చైనాలో ఓ కంపెనీ మాత్రం మరింత అడ్వన్స్‌డ్‌గా ఆలోచించింది. కరోనా సేఫ్టీ కోసం సూట్లను తయారు చేసింది. షీల్డ్‌ టైపులో సూట్లు తయారుచేస్తున్నది. వైరస్‌ నుంచి  తమను తాము రక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడుతాయని అంటున్నది ఆ కంపెనీ  బీజింగ్‌కు చెందిన ఫర్మ పెండా దీనిని డిజైన్‌ చేసింది. నిద్రపోతున్న గబ్బిలం ఆకారంలో సూట్‌ ఉంటుంది. అల్ట్రా వాయిలెట్‌ టెక్నాలజీ సాయంతో పని చేస్తుంది. హానికర వైరస్‌ల నుంచి, అపరిశుభ్ర పరిసరాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఈ షీల్డ్‌ పరిసరాల్లో ఉన్న అల్ట్రావాయిలెట్‌ రేడియేషన్‌కు హీట్‌ అవుతుంది. దీంతో దగ్గర్లో ఉన్న వైరస్‌  చనిపోతుంది. పైగా దీనిని మడిచి పెట్టుకోవచ్చు. 


వీయూ 4కే టీవీ

ప్రముఖ టెలివిజన్‌ సంస్థ వీయు(వు) మరో అడుగు ముందుకేసింది. టెలివిజన్‌ ఉత్పత్తి రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. తాజా సరికొత్త  ఫీచర్లతో ప్రీమియం 4కే  టీవీని ఆవిష్కరించింది. 4కే టీవీ శ్రేణిలో మూడు రకాల సైజులు లభ్యమవుతున్నాయి. 43 అంగుళాలు (109 సెంటీమీటర్లు), 50 అంగుళాలు (127 సెంటీమీటర్లు) తోపాటు 55 అంగుళాలు (140 సెంటీమీటర్ల) సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. పదేండ్లుగా వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా సేవలు అందిస్తున్నామని ‘వు’ సంస్థ పేర్కొన్నది.   ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ అందుబాటులో ఉంది.  దీని ప్రారంభ ధర రూ. 24,999.
వీయూ 4కే టీవీ‘ఫీచర్లు

ప్రాసెసర్‌ : క్వాడ్‌ కోర్‌ 

స్టోరేజీ : 16జీబీ స్టోరేజీ

మెమొరీ : 2జీబీ ర్యామ్‌

ఓఎఎస్‌ : ఆండ్రాయిడ్‌ 9.0 

కనెక్టివీటి : గూగుల్‌ క్రోమ్‌ వైఫై, బ్లూటూత్‌ 5. వాయిస్‌ సెర్చ్‌, గూగుల్‌ అసిస్టెన్స్‌ 

యాప్స్‌ : ప్లేస్టోర్‌, నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌, ఒటిటి సపోర్ట్‌. డాల్బీ విజన్‌, హెచ్‌ఆర్డీ 10 సపోర్ట్‌

ఆడియో : 30 వాట్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌, డాల్బీ ఆడియో.


వాట్సాప్‌.. కొత్త ఫీచర్‌ 

వాట్సాప్‌లో గత కొద్ది రోజులుగా ఓ ఫీచర్‌ వస్తున్నది అంటూ వినియోగదారులు వేచి చూశారు. ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌ అప్‌డేట్‌ చేస్తే ఆ ఫీచర్‌ యాడ్‌ అవుతుంది. ఆ ఫీచరే ‘డార్క్‌ మోడ్‌'. రాత్రి వేళల్లో వాట్సాప్‌ వినియోగించే యూజర్ల కండ్లకు శ్రమ తగ్గించేందుకు ఈ ఫీచర్‌ తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసి ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 10, ఐఓఎస్‌ 13లో ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ప్రత్యేక డార్క్‌ గ్రే కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ యాప్‌ తక్కువ లైటింగ్‌ను వెదజల్లుతుంది.  డార్క్‌మోడ్‌ అంటే.. సాధారణంగా ఇంటర్నెట్‌ సమాచారమంతా తెలుపు బ్యాక్‌గౌండ్‌ నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనికి భిన్నంగా నలుపు బ్యాక్‌ గౌండ్‌తో తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల కండ్లకు తక్కువ శ్రమ కలుగుతుంది. రాత్రి వేళల్లో సౌకర్యంగా ఉంటుంది. వాట్సాప్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడి నుంచి చాట్స్‌లోకి, థీమ్‌లోకి వెళ్లండి. డార్క్‌ మోడ్‌ను సెలక్ట్‌ చేసుకోండి.భారత్‌లోకి మోటో రేజర్‌

కిందటి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన మోటరోలా రేజర్‌ ఇప్పుడు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆన్‌లైన్‌ స్టోర్‌ ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంది. మొబైల్‌ తయారీ సంస్థలు ప్రస్తుతం ఫోల్డబుల్‌ ఫోన్లపై దృష్టి సారిస్తున్న సందర్భంలో మోటరోలా తన బ్రాండ్‌ను ‘మోటో రేజర్‌'తో ఏర్పరుచుకుంటున్నది. ఫీచర్లు 

డిస్‌ప్లే : 6.2 అంగుళాలు

ప్రాసెసర్‌ : ఎస్‌డిఎం 710

మెమొరీ: 6 జీబీ

స్టోరేజీ : 128 జీబీ

రియర్‌ కెమెరా : 16 ఎంపీ

సెల్ఫీ కెమెరా : 5 ఎంపీ

బ్యాటరీ : 2510

కలర్‌ : బ్లాక్‌ 


logo