గురువారం 02 ఏప్రిల్ 2020
Science-technology - Mar 11, 2020 , 22:56:55

ఆకట్టుకుంటున్న స్మార్ట్‌ వాచ్‌

ఆకట్టుకుంటున్న స్మార్ట్‌ వాచ్‌
  • 41mm వెర్షన్‌ వాచ్‌ ధర రూ.16,000
  • 46mm వాచ్‌ ధర రూ.21,400

ఒప్పో కొత్త స్మార్ట్‌వాచ్‌ ఆకట్టుకుంటున్నది. ఇటీవల చైనాలో ‘Find X2’ లాంచ్‌ ఈవెంట్లోనే ఆ కంపెనీ దీన్ని విడుదల చేసింది. ఒప్పో బ్రాండ్‌ నుంచి మొట్టమొదటిసారిగా స్మార్ట్‌వాచ్‌ మార్కెట్లోకి వచ్చింది. స్యామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్‌ యాక్టివ్‌ 2 గాడ్జెట్‌కు పోటీగా ఒప్పో ఈ స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు ఆకర్షిస్తున్నది. ఇది చూడటానికి అచ్చం Apple Watch Series 4 మాదిరిగానే కనిపిస్తోంది. ఫీచర్లలో  అమోలెడ్‌ డిస్‌ప్లే, VOOC చార్జింగ్‌ టెక్నాలజీ, ECG సెన్సార్‌ బోర్డు ఉంది. ఒకసారి చార్జ్‌ చేస్తే సాధారణ వాడకంపై 40 గంటల బ్యాటరీ లైఫ్‌ కలిగి ఉంది. బ్యాటరీ సేవింగ్‌ మోడ్‌ ద్వారా 21 రోజుల వరకు బ్యాటరీ చార్జింగ్‌ వస్తుంది.logo