బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Mar 11, 2020 , 22:48:28

అదిరేటి ఐక్యూ హెడ్‌ఫోన్స్‌

అదిరేటి ఐక్యూ హెడ్‌ఫోన్స్‌

చైనా కంపెనీ లెనోవా నుంచి వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్లు విడుదలయ్యాయి. సరికొత్త ఐక్యూ టెక్నాలజీతో ‘హెచ్‌డి 116’ పేరుతో ఇవి అందుబాటులో ఉన్నాయి.

మంచి లుక్‌, సౌండ్‌ అవుట్‌పుట్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ లాంటి క్లాసిక్‌  ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీంతో పాటు డ్యూయల్‌ ఐక్యూ మోడ్‌, 240హెచ్‌ స్టాండ్‌బై బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఒకసారి చార్జ్‌ చేస్తే 24 గంటలు పని చేస్తుంది. 2019లో  తమ ఆడియో పరికరాలకు ఇండియా నుంచి వచ్చిన  విశేష ఆదరణ నేపథ్యంలో ఐక్యూ టెక్నాలజీతో అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇవి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో  లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ .2,499.


logo