బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Mar 08, 2020 , 22:44:26

విశ్వదర్శనం

విశ్వదర్శనం
  • ఆకాశమంత అద్దం

ఇంట్లో నిలువెత్తు అద్దం ఉంటేనే చాలామంది దానిముందు నుంచి పక్కకు రారు. అలాంటిది ఒక బహిరంగ ప్రదేశంలో నిలబడి ఎటుచూసినా కనుచూపుమేర అద్దమే కనిపిస్తే, అందులో ఆకాశం అందాలన్నీ మన కాళ్లవద్దే ఉన్నట్లు కనిపిస్తే ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు కదా. అలాంటి అద్దం బొలీవియాలో ఉంది. అద్దమంటే అద్దం కాదులెండి. అక్కడి ఇన్‌కాహువాసి దీవిలో కొన్ని లక్షల ఏండ్ల క్రితం ఓ సరస్సు ఉండేది. అందులోని నీరు పూర్తిగా ఆవిరికావడంతో ఉపరితలం మొత్తం ఉప్పు పేరుకుపోయి తెల్లగా అద్దంలా మారిపోయింది. ఆ తెల్లని ఉపరితలంపై ఆకాశంలోని మబ్బులు, పక్షులు ఎంతో అందంగా కనిపిస్తాయి. భూమిమీద అతిపెద్ద ఉప్పు ఉపరితలం ఇదే. మనదేశంలో కూడా ఇలాంటి ప్రదేశం ఉంది. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతానికి వెళితే చూడొచ్చు. కంటికి కనిపించేంత దూరం తెల్లగా పిండి ఆరబోసినట్లుగానే ఉంటుంది. 


logo