గురువారం 02 ఏప్రిల్ 2020
Science-technology - Mar 08, 2020 , 22:42:31

విజ్ఞాన విపంచి

విజ్ఞాన విపంచి
  • ఇదీ ఫోనే

ఏంటిది?  బుల్లి  రేడియోనా! కానీ పాతకాలంనాటి ల్యాండ్‌లైన్‌ ఫోన్లలో ఉన్నట్లు డయల్‌ప్యాడ్‌ ఉంది. ఫోనా ఏంటి అని తికమక పడుతున్నారా? నిజమే ఇది ఫోనే.. న్యూయార్క్‌లో ఉండే జస్టిన్‌ హాప్ట్‌ అనే అంతరిక్ష శాస్త్రవేత్త దీన్ని తయారు చేశారు. స్మార్ట్‌ఫోన్‌ ఆమెకు అంతగా నచ్చలేదట. కొత్తగా తానే స్వయంగా ఓ ఫోన్‌ తయారుచేసుకుందామని మూడేండ్లు ప్రయత్నించి ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఈ ఫోన్‌ తయారీకి వాడిన వస్తువులన్నీ వాడిపడేసిన చెత్తేనట. ఈ ఫోన్‌ నాలుగు అంగుళాల పొడవు, మూడంగుళాల వెడల్పు, ఒక అంగుళం మందం ఉంది. బ్యాటరీ కూడా 30 గంటల టాక్‌టైమ్‌ కెపాసిటీ ఉందట. ఈ ఫోన్‌ ఫొటోలను ఆమె సోషల్‌మీడియాలో పెట్టగా భలేగా ఉందే ఈ ఫోన్‌ అంటూ ఎంతకు అమ్ముతారని అడుగుతున్నారట. మొదట ఆమె ఈ ఫోన్‌ను ఎవరికీ అమ్మటానికి ఇష్టపడలేదట. కానీ ఒక్క వారంలోనే 30 మంది ఫోన్లు చేసి తమకు అలాంటి ఫోన్‌ కావాలని బతిమాలుతున్నారట. దాంతో 130 అమెరికన్‌ డాలర్లకు అమ్ముతానని ఆమె రేటు కూడా ఫిక్స్‌ చేశారు. ఫోన్‌ బాగుంది కదా..! 


logo
>>>>>>