బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Mar 05, 2020 , 22:22:01

6 నెలల్లో కరోనా వ్యాక్సిన్‌

6 నెలల్లో కరోనా వ్యాక్సిన్‌

‘కరోనావైరస్‌'కు మరో ఆరునెలల్లో వ్యాక్సిన్‌ను తయారుచేసే కార్యాన్ని శాస్త్రవేత్తలు తలకెత్తుకొన్నారు. దీనికిగాను సరికొత్త సాంకేతికతను ఉపయోగించబోతున్నట్టు వారు ప్రకటించారు.

ఏదేని వ్యాధి నిరోధానికి వ్యాక్సిన్‌ను సృష్టించడమంటే ఏండ్ల తరబడి సమయం పడుతుంది. కారణం, అది పలు సుదీర్ఘ విధానాలతో కూడుకొని ఉంటుంది కనుక. ముందు జంతువులపైన, పిమ్మట మనుషులపైన క్లినికల్‌ ప్రయోగాలు జరిపి, అంతర్జాతీయంగా ఆ మేరకు ‘ప్రామాణిక ఆమోదం’ పొందవలసి ఉంటుంది. అయితే, ప్రస్తుత ‘కొవిద్‌-19’ (కరోనావైరస్‌) సృష్టిస్తున్న మారణహోమం నేపథ్యంలో ప్రసిద్ధులైన శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలతో అత్యంత వేగవంతంగా వ్యాక్సిన్‌ను రూపొందించే కార్యక్రమాన్ని తమ భుజస్కందాలపై వేసుకొన్నారు. గత నెల (ఫిబ్రవరి) మొదటివారంలోనే మొదలైన ఈ ప్రయత్నాలు మరో 12 వారాలలో క్లినికల్‌ పరీక్షలకు సిద్ధం కావచ్చునని అంటున్నారు. 2017లో ఎబోలా (పశ్చిమ ఆఫ్రికాలో పుట్టి, సుమారు 11,000 మందికిపైగా పొట్టన పెట్టుకొన్న) వైరస్‌ నేపథ్యంలో ఏర్పడిన సీఈపీఐ (CEPI: Coalition for Epidemic Preparedness Innovations) నిపుణుల బృందమే ఈ బాధ్యతనూ తలకెత్తుకోవడం విశేషం. పై శాస్త్రవేత్తలలో అమెరికానుంచి ఆస్ట్రేలియా వరకు అందరూ ప్రసిద్ధులేనని అంటున్నారు. 


logo