శనివారం 04 ఏప్రిల్ 2020
Science-technology - Mar 05, 2020 , 22:03:26

కొత్త కీటకం

కొత్త కీటకం

బహుళ ఈకలతో కూడిన కొత్త రకపు కీటకాన్ని దక్షిణాఫ్రికాలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది చూడటానికి సీతాకోక చిలుకలా ఉన్నా వాటి జాతికి చెందింది కాదని వారన్నారు. చిమ్మెట (moths)ల తరగతికి చెందిన ఈ కొత్త రకపు కీటకాన్ని ‘ఎల్యూసిటిడా’ (Alucitidae) గా పిలుస్తున్నారు. దీనికి అనేక ఈకలు ఉన్నట్టు ఎంటొమాలజిస్టులు (క్రిమికీటక శాస్త్రవేత్తలు) చెబుతున్నారు. చూడటానికి సీతాకోకచిలుక (butterfly) ను పోలిన రెక్కలతో వుండే ఈ చిమ్మెటలు నిజానికి బటర్‌ఫ్లయి జాతివి కావు. దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కీటకాలు సాధారణంగా ఉష్ణ, ఉపోష్ణ ప్రదేశాలలోనే ఉంటున్నట్టు వారు గుర్తించారు. వీటికి ఈకలు మొత్తం ఆరు భాగాలుగా ఉన్నాయని, ఇంకా కొన్నింటికైతే ఏడు భాగాల ఈకలూ వున్నట్టుకూడా వారు తెలిపారు. logo