ఆదివారం 29 మార్చి 2020
Science-technology - Mar 03, 2020 , 22:36:51

ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌

ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌

ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేయనుంది. అరుదుగా ఇంటరాక్ట్‌ అయ్యే ప్రొఫైళ్లను ఎంపిక చేసి వాటిపై యూజర్లకు అన్‌ఫాలోను చూపించనున్నది. దీని ద్వారా క్లోజ్‌గా ఉన్న స్నేహితులతో గ్రూప్‌ ఏర్పాటు చేయడానికి, ఆక్టీవ్‌గా లేని ఫాలోయర్లను అవాయిడ్‌ చేసేందుకు సహకరిస్తుంది. మీ న్యూస్‌ ఫీడ్‌ను ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరు ఫాలో కావడం లేదు అనే విషయాలను ఈ ఫీచర్‌ తెలియజేస్తుంది.  మీతో ఎవరు ఎక్కువగా ఇంటరాక్ట్‌ అవుతున్నారో దాన్ని బట్టి సలహాలు ఇస్తుంది. అలాంటి అంశాలన్నింటినీ మేనేజ్‌ చేసుకోవచ్చ’ని తాజా ఫీచర్‌ గురించి వివరిస్తూ ఇన్‌స్టాగామ్‌ సీఈఓ ఆడమ్‌ ముసోరి ట్వీట్‌ చేశారు. 


logo